రెండేళ్లుగా క్రికెట్ క్రీజులో సెంచరీ కొట్టలేకపోయిన భారత సారథి విరాట్ కోహ్లీ... ఫాలోవర్ల విషయంలో మాత్రం సెంచరీ మార్కు కొట్టేశాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో 100 మిలియన్ల ఫాలోవర్లు ఉన్న అతికొద్ది సెలబ్రిటీల జాబితాలో చేరిపోయాడు విరాట్ కోహ్లీ.

భారత్‌లోనే కాదు, ఆసియాలోనే అత్యధిక మంది ఫాలోవర్లు ఉన్న సెలబ్రిటీ విరాట్ కోహ్లీయే. ఫుట్‌బాల్ క్రీడాకారులు క్రిస్టియానో రొనాల్డో, లియోనెల్ మెస్సీ, నేమర్ తర్వాత 100 మిలియన్ల క్లబ్‌లో చేరిన నాలుగో అథ్లెట్ విరాట్ కోహ్లీ.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by ICC (@icc)

వీరితో పాటు హాలీవుడ్ హీరో ‘ది రాక్’ డ్వేన్ జోన్స్, మ్యూజిషియన్, నటి అరియానా గ్రాండీ, మోడల్, బిజినెస్ వుమెన్ కెలీ జెన్నర్ మాత్రమే 100 మిలియన్ల కంటే ఎక్కువ మంది ఫాలోవర్లు కలిగిన వారిలో ఉన్నారు. గత ఏడాది ఒక్క స్పాన్సర్ పోస్టును పోస్టు చేయడానికి విరాట్ కోహ్లీ రూ.2 కోట్ల 20 లక్షల రూపాయలు తీసుకున్నామని సమాచారం.