టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఫిట్‌నెస్‌ను మరో స్థాయికి తీసుకెళ్లిన క్రికెటర్. శారీరక దృఢత్వంపై అతడికి ఎనలేని నమ్మకం. జట్టు సభ్యులంతా రెండు గంటలు కసరత్తులు చేస్తే.. కోహ్లీ నాలుగు గంటలు కష్టపడతాడు. ఎక్కువ సేపు జిమ్‌లో గడుపుతూ భారత ఆటగాళ్లందరికీ స్ఫూర్తిగా నిలుస్తున్నాడు. ఆటలోనే కాదు ఫిట్‌నెస్ విషయంలోనూ కోహ్లీనే ముందుండి టీమ్‌ని నడిపిస్తున్నాడు.

ఈ కరోనా లాక్ డౌన్ సమయంలో ఇప్పటికే రెండు, మూడు సార్లు కోహ్లీ తన ఫిట్నెస్ వీడియోలు షేర్ చేయగా.. తాజాగా మరో వీడియో షేర్ చేశాడు. కాగా... ఈ వీడియోలో కోహ్లీ తనకు నచ్చిన పుష్ అప్స్ చేశాడు. కాగా.. ఈ వీడియో ఇప్పుడు నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటుంది.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

If I had to make a choice of one exercise to do everyday, this would be it. Love the power snatch 💪😃

A post shared by Virat Kohli (@virat.kohli) on Jul 3, 2020 at 7:14am PDT

 

కాగా... ఇటీవల హార్దిక్ పాండ్యా కోహ్లీకి ఛాలెంజ్ విసరగా.. అందులో భాగంగా ఈ వీడియో విడుదల చేశాడు.  స్వీకరించపోయినా.. కెప్టెన్ విరాట్ కోహ్లీ స్వీకరించాడు. హార్దిక్ తరహాలోనే పుష్ అప్స్ చేసిన కోహ్లీ.. వాటికి క్లాప్స్ కూడా జోడించాడు. ఎగురుతూ పుష్‌ అప్స్‌ చేసే క్రమంలో నేలను తాకకముందే చప్పట్లు కొట్టాడు. అంతేకాదు అదే పుష్ అప్స్‌ని రివర్స్‌లో వెనక్కి వెళ్తూ కూడా చేయడం విశేషం.

తాజాగా జూన్ 3న శుక్రవారం కోహ్లీ... వర్కవుట్ వీడియో పోస్ట్ చేస్తూ... ప్రత్యేక వర్కవుట్ చేసి చూపించాడు. అది తన ఫేవరెట్ అని చెప్పాడు. తాను రోజూ ఏదైనా ఎక్సర్‌సైజ్ చేయాలని అనుకుంటే... అది ఇదే... అని తన ట్విట్టర్ అకౌంట్‌లో తెలిపాడు.