కోల్ కతా: వచ్చే ఏడాది ఆస్ట్రేలియాలో గులాబీ బంతితో టెస్టు మ్యాచ్ ఆడడానికి తాను సిద్ధమేనని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అన్నాడు. కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో విరాట్ కోహ్లీ సేన బంగ్లాదేశ్ పై పింక్ బాల్ తో తొలి డే అండ్ నైట్ మ్యాచ్ ఆడబోతున్న విషయం తెలిసిందే. ఈ టెస్టు మ్యాచ్ రేపు (శుక్రవారం) ప్రారంభమవుతుంది. 

అయితే, గులాబీ బంతితో టెస్టు మ్యాచ్ ఆడాలన్నప్పుడు ముందుగా ఓ ప్రాక్టీస్ మ్యాచ్ పెడితే బాగుంటుందని విరాట్ కోహ్లీ అన్నాడు. ఇంతకు ముందు ఆస్ట్రేలియాలో పింక్ బాల్ తో డే అండ్ నైట్ మ్యాచ్ ఆడడానికి టీమిండియా ఇష్టపడలేదు. ఇంతకు ముందు ఎందుకు నిరాకరించారనే విషయంపై విరాట్ కోహ్లీ వివరించాడు. పింక్ బాల్ క్రికెట్ ను ఫిల్ కావాలని అనుకున్నామని, ఆ క్రమంలోనే ఇది జరుగుతోందని ఆయన గురువారం మీడియా ప్రతినిధులతో ్న్నాడు. 

Also Read: గంగూలీ గల్లీలో గులాబీ బంతి... దాని కథ కమామిషు

పింక్ బాల్ తో మ్యాచ్ ను అకస్మాత్తుగా ప్రతిపాదించే సరికి తాము వ్యతిరేకించామని, తమకు పింక్ బాల్ తో ప్రాక్టీస్ కూడా లేదని, ఫస్ట్ క్లాస్ గేమ్ ఏదీ పింక్ బాల్ తో ఆడలేదని వివరించాడు. ప్రస్తుతం ఈడెన్ గార్డెన్స్ లో బంగ్లాదేశ్ పై జరుగుతున్న మ్యాచ్ ను అంత అకస్మాత్తుగా పెట్టడం లేదని చెప్పారు. 

చాలా ముందుగానే నిర్ణయించి, ప్రాక్టీస్ మ్యాచులు పెడితే పింక్ బాల్ తో ఆడడానికి తనకేమీ అభ్యంతరం లేదని చెప్పాడు. అందుకు కొంత సిద్ధం కావాల్సి ఉంటుందని ఆయన అన్నాడు. అస్ట్రేలియాలో అకస్మాత్తుగా డే అండ్ నైట్ మ్యాచ్ కు షెడ్యూల్ చేశారని, అందుకే తాము నిరాకరించామని అన్నాడు.