BREAKING: ఐసీసీ మెన్స్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ -2023గా విరాట్ కోహ్లీ
విరాట్ కోహ్లి 2023 సంవత్సరానికి ICC పురుషుల వన్డే ‘‘క్రికెటర్ ఆఫ్ ది ఇయర్’’ పురస్కారానికి ఎంపికయ్యారు. వన్డే క్రికెట్‌కు విశేష సేవలందించడంతో పాటు ఆటలో అతని స్థాయిని కోహ్లీ పటిష్టం చేసుకున్నాడు. అవార్డు నేపథ్యంలో విరాట్ కోహ్లీకి క్రికెట్ ప్రముఖులు, సహచరులు, అభిమానులు అభినందనలు తెలియజేస్తున్నారు.

కాగా.. విరాట్ కోహ్లీ ఇప్పటికే 2012, 2017, 2018లలో ఈ అవార్డును అందుకున్నారు. తద్వారా నాలుగు సార్లు ‘‘వన్డే ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు’’ను అందుకున్న క్రికెటర్‌గా కోహ్లీ రికార్డుల్లోకెక్కాడు. తాజా పురస్కారంతో కలిపి కోహ్లీ ఐసీసీ అవార్డుల సంఖ్య 10కి చేరింది. గతేడాది భీకర ఫాంలో వున్న కోహ్లీ 24 ఇన్నింగ్సుల్లో 72.47 సగటుతో 1377 పరుగులు చేశాడు. అలాగే వన్డే ప్రపంచకప్‌లో 765 పరుగులు చేసి టోర్నీలో టాప్ స్కోరర్‌గా నిలిచాడు.