Asianet News TeluguAsianet News Telugu

రోహిత్ శర్మ అంత ధైర్యంగా ఆడడానికి విరాట్ కోహ్లీయే కారణం... - ఆశీష్ నెహ్రా

టాపార్డర్‌లో రోహిత్ శర్మ దూకుడుగా బ్యాటింగ్ చేయడానికి విరాట్ కోహ్లీయే కారణం.. అలాగే విరాట్ సక్సెస్‌కి రోహితే కారణం.. ఆశీష్ నెహ్రా కామెంట్స్.. 

Virat Kohli main reason for Rohit Sharma fearless Batting, Ashish Nehra comments on ICC World cup 2023 CRA
Author
First Published Nov 18, 2023, 3:38 PM IST

ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో టీమిండియా నుంచి విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, శ్రేయాస్ అయ్యర్ ముగ్గురూ 500+ పరుగులు చేశారు. విరాట్ కోహ్లీ మూడు సెంచరీలు, 8 సార్లు 50+ స్కోర్లు నమోదు చేసి వరల్డ్ రికార్డు బ్రేక్ చేశాడు.. 

మరోవైపు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మొదటి ఓవర్ నుంచే దూకుడుగా ఆడుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టిస్తున్నాడు.. ఈ ఇద్దరి సమన్వయమే టీమిండియా సక్సెస్‌కి ప్రధాన కారణం.

‘రోహిత్ శర్మ టాపార్డర్‌లో దూకుడుగా బ్యాటింగ్ చేయడానికి విరాట్ కోహ్లీయే కారణం. తాను త్వరగా అవుటైనా విరాట్ కోహ్లీ భారీ స్కోరు చేయగలడనే నమ్మకం. విరాట్ కోహ్లీ సక్సెస్‌కి రోహిత్ శర్మ దూకుడైన బ్యాటింగే కారణం. 

రోహిత్ ఆరంభంలోనే వేగంగా పరుగులు చేయడంతో విరాట్ కోహ్లీకి క్రీజులో కుదురుకోవడానికి కావాల్సినంత సమయం దొరుకుతోంది... ఈ ఇద్దరూ మంచి సమన్వయంతో ఆడుతూ టీమిండియాకి విజయాలు అందిస్తున్నారు. భారత జట్టు సక్సెస్ సీక్రెట్ ఇదే...’ అంటూ చెప్పుకొచ్చాడు టీమిండియా మాజీ క్రికెటర్, గుజరాత్ టైటాన్స్ హెడ్ కోచ్ ఆశీష్ నెహ్రా...

2003 వన్డే వరల్డ్ కప్‌లో ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 23 పరుగులిచ్చి 6 వికెట్లు తీశాడు ఆశీష్ నెహ్రా. 20 ఏళ్లుగా వరల్డ్ కప్‌లో టీమిండియా బెస్ట్ బౌలింగ్ పర్ఫామెన్స్ ఇదే. న్యూజిలాండ్‌తో జరిగిన సెమీ ఫైనల్‌లో 7 వికెట్లు తీసిన మహ్మద్ షమీ, ఆశీష్ నెహ్రా రికార్డును వెనక్కి నెట్టేశాడు.. 

Follow Us:
Download App:
  • android
  • ios