Asianet News TeluguAsianet News Telugu

మీమర్స్‌కు పని కల్పించిన విరాట్ కోహ్లీ.. పిల్లలను భయపెట్టే చూపుతో సోషల్ మీడియాలో రచ్చ..

IND vs AUS T20I:ఆస్ట్రేలియాతో మొహాలీలో కూడా కోహ్లీ ఇచ్చిన ఓ లుక్.. ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్నది. సోషల్ మీడియాలో మీమర్స్ కు  చేతినిండా పని కల్పిస్తున్నది. 

Virat Kohli Look Becoming a Meme: Twitter Can't Keep Calm After Batting maestro Expression Went viral
Author
First Published Sep 21, 2022, 4:50 PM IST

మ్యాచ్ జరుగుతున్నప్పుడు ఫీల్డ్ లో  దూకుడుగా ఉండే టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లీ.. అప్పుడప్పుడూ ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ కూడా నెట్టింట వైరల్ అవుతాయి.  ముఖ్యంగా ఏదైనా క్యాచ్ మిస్ అయినప్పుడో..  ఎల్బీడబ్ల్యూ ఔట్ అప్పీల్ చేసినా రివ్యూ  తమకు అనుకూలంగా రానప్పుడో.. రనౌట్ ఛాన్స్ చేజారినప్పుడో కోహ్లీ ఇచ్చే ఎక్స్ప్రెషన్స్   సోషల్ మీడియాలో వైరల్ అవుతాయి. తాజాగా  ఆస్ట్రేలియాతో మొహాలీలో కూడా కోహ్లీ ఇచ్చిన ఓ లుక్.. ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్నది. సోషల్ మీడియాలో మీమర్స్ కు  చేతినిండా పని కల్పిస్తున్నది. 

అసలు విషయానికొస్తే.. ఆస్ట్రేలియా బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఉమేశ్ యాదవ్ రెండో ఓవర్ బౌలింగ్ చేశాడు. ఆ ఓవర్లో ఆసీస్ ఓపెనర్ కామెరూన్ గ్రీన్.. వరుసగా  తొలి నాలుగు బంతులను బౌండరీకి తరలించాడు.  

గ్రీన్  మూడో ఫోర్ కొట్టే క్రమంలో  కోహ్లీ ఈ ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు.  ఉమేశ్ వేసిన క్లిష్టమైన బంతిని కూడా  గ్రీన్ అలవోకగా బౌండరీకి తరలించాడు. అప్పుడు కోహ్లీ.. ‘ఇతడేంటి..? జాలి, దయ లేకుండా ఇలా బాదుతున్నాడు..’ అన్నట్టుగా ఫేస్ పెట్టాడు. ఈ ఫోటో, వీడియో ఇప్పుడు ఇంటర్నెట్ లో  చక్కర్లు కొడుతున్నది. 

 

మ్యాచ్ ముగిశాక కోహ్లీ ఫోటోపై నెటిజన్లు సరదా కామెంట్లు చేశారు. ‘ఇన్నింగ్స్ చివర్లో భువనేశ్వర్ కుమార్ బౌలింగ్ చూసిన కోహ్లీ రియాక్షన్ ఇది..’, ‘పిల్లాడు అన్నం తినకపోతే బూచాడికి పట్టిస్తా.. ఇదిగో చూడు బూచోడు ఇక్కడే ఉన్నాడు.. నిన్నే చూస్తున్నాడు..’,  ‘మ్యాచ్ ముగిశాక టీమిండియాను అభిమానించే ప్రతి క్రికెట్ ఫ్యాన్ రియాక్షన్ ఇదే..’ అని కామెంట్స్ వెల్లువెత్తుతున్నాయి. 

 

 

మ్యాచ్ విషయానికిస్తే టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 208 పరుగులు చేసింది.  హార్ధిక్ పాండ్యా (71 నాటౌట్), కెఎల్ రాహుల్ (55), సూర్యకుమార్ యాదవ్ (46) రాణించారు. అనంతరం ఆసీస్.. 19.2 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. కామెరూన్ గ్రీన్ (61) వీరవిహారానికి తోడు మాథ్యూ వేడ్ (45) మెరుపులతో ఆసీస్ నే విజయం వరించింది. 

 

Follow Us:
Download App:
  • android
  • ios