పాకిస్థాన్ మరోసారి తన దురహంకారాన్ని ప్రదర్శించింది. సెప్టెంబర్ 6 డిపెన్స్ డే సందర్భంగా భారత దేశాన్ని అవమానించేలా వ్యవహరించిన చివరకు తానే అబాసుపాలయ్యింది.  భవిష్యత్ లో యావత్ భారతదేశం తమ ఆధీనంలోనే వుందనేవిధంగా ఓ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లుకొడుతోంది. భారత క్రికెటర్లు కొందరు పాకిస్థాన్ టీంలో ఆడుతున్నట్లుగా సదరు వీడియోలో చూపించారు. 
 
పాకిస్థాన్ లో ఈ వీడియో తెగ చక్కర్లు  కొడుతుండటంతో ఓ వ్యక్తి దాన్ని ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. '' పాకిస్థాన్ క్రికెట్ టీం శ్రీనగర్ లో మ్యాచ్ ఆడుతోంది. ఇందులో పాక్ తరపున విరాట్ కోహ్లీ బరిలోకి దిగాడు. ఏమీ లేదు...ఇది కేవలం ఊహాజనితం మాత్రమే.'' అంటూ ఓ వివాదాస్పద వీడియోను జతచేస్తూ ట్వీట్ చేశాడు. 

ఆ వీడియోలో ఓ పాకిస్థానీ కుటుంబమంతా కలిసి క్రికెట్ చూస్తుంటారు. అయితే ఆ జట్టులో ఇప్పుడున్న పాకిస్థాన్ క్రికెటర్లతో పాటు విరాట్ కోహ్లీ, శిఖర్ ధవన్ సభ్యులుగా వున్నట్లు చూపించారు. అంతేకాదు ఈ మ్యాచ్ ను చూస్తున్న ఓ పాప తప్పకుండా పాకిస్థాన్ ను కోహ్లీనే  గెలిపిస్తాడు అని అంటుంది. 

అంతలోనే పాప పక్కనే వున్న వ్యక్తి ఒకప్పుడు కోహ్లీ భారత జట్టు తరపున ఆడేవాడని చెబుతాడు. దీంతో చిన్నారులు భారతా..!  అంటూ ఆశ్యర్యపోతారు. అంటే ఆ పదమే ఎప్పుడు వినలేమన్నట్టుగా చిన్నారులు ఆశ్యరపోతారు. 

ఇలా 2025నాటికి పాకిస్థాన్ భారత దేశం మొత్తాన్ని ఆక్రమిస్తుందని ఈ వీడియోలో పరోక్షంగా తెలియజేశారు. అందువల్లే ధవన్, కోహ్లీ, అశ్విన్, జడేజాలు పాక్ జట్టు తరపున ఆడుతున్నట్లు చూపించారు. టీ20 వరల్డ్ కప్ 2025 జమ్ము కశ్మీర్ లోని శ్రీనగర్ లో జరగ్గా వీరు అందులో పాక్ తరపున పాల్గొంటారట. ఇలా భారత్ ను కించపర్చేలా రూపొందిన ఈ వీడియోపై భారతీయుల నుండి ఆగ్రహం వ్యక్తమవుతోంది. 

దీనిపై కొందరు నెటిజన్లు ఘాటుగా స్పందించారు. '' 2025నాటికి కూడా పాకిస్థాన్  జట్టు పరిస్థితి  ఇంకా ఇలాగే వుంటుందన్నమాట. ఆ జట్టును గెలిపించడానికి కోహ్లీ, ధవన్ లే దిక్కన్నమాట.'' అంటూ కామెంట్ చేస్తున్నారు. ''పాక్ భారత్ ను ఆక్రమించుకోవడం కాదు మీ చెరలోని ఆక్రమిత కశ్మీర్ ను మేం స్వాధీనం చేసుకోవడం ఖాయం... చూస్తూ వుండండి.'' అంటూ మరికొందరు నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఇలా పాక్ మరోసారి భారత్ పై విషాన్ని చిమ్ముతూ అహంకారాన్ని ప్రదర్శించి విమర్శలపాలయ్యింది.