రజత్ పాటిదార్ అజేయంగా 112 పరుగులు చేయడంతో.. ఆర్సీబీ కి విజయం చాలా సులువైంది. కాగా.. ఈ మ్యాచ్ ప్రారంభానికి ముందు కోహ్లీకి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ గా మారింది.

లక్నో సూపర్ జెయింట్స్‌(LSG)తో బుధవారం రాత్రి జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో 54 బంతులాడిన రజత్ పాటిదార్ 12x4, 7x6 సాయంతో అజేయంగా 112 పరుగులు చేశాడు. దాంతో.. మ్యాచ్‌లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన బెంగళూరు టీమ్ 4 వికెట్ల నష్టానికి 207 పరుగులు చేయగా.. లక్ష్యఛేదన ఆఖర్లో తడబడిన లక్నో టీమ్ 193/6కి పరిమితమైంది. ఈ ఓటమితో లక్నో టీమ్ టోర్నీ నుంచి నిష్క్రమించగా.. బెంగళూరు జట్టు శుక్రవారం రాత్రి రాజస్థాన్ రాయల్స్‌(RR)తో క్వాలిఫయర్-2లో తలపడనుంది.

కాగా.. లక్నోతో జరిగిన మ్యాచ్ లో కోహ్లీ కేవలం 25 పరుగులే చేశాడు. కానీ.. రజత్ పాటిదార్ అజేయంగా 112 పరుగులు చేయడంతో.. ఆర్సీబీ కి విజయం చాలా సులువైంది. కాగా.. ఈ మ్యాచ్ ప్రారంభానికి ముందు కోహ్లీకి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ గా మారింది.

Scroll to load tweet…

వర్షం కారణంగా ఆలస్యమైన మ్యాచ్‌కు ముందు, విరాట్ కోహ్లీ ఈడెన్ గార్డెన్స్‌లో తన జట్టు ప్రాక్టీస్ సెషన్‌లో చేరాడు, అక్కడ ఒక వ్యక్తి అతనికి నిరంతరం కోపం తెప్పించాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఆ వీడియోలో ఎవరో కోహ్లీని కెమేరాలో బంధించడానికి ప్రయత్నిస్తున్నారు. అలా చేయవద్దని కోహ్లీ చెబుతూనే ఉన్నాడు. అయినా అతను ఆపకపోవడం గమనార్హం. ఆ సమయంలో కోహ్లీ గార్డ్ వేసుకుంటున్నాడు. ఆ సమయంలో కూడా వీడియో తీయడానికి ప్రయత్నించడం గమనార్హం. వీడియో తీయవద్దని కోహ్లీ ఎంత చెబుతున్నా అతను వినకపోవడం గమనార్హం. ఇంతకీ కోహ్లీకి అంత కోపం తెప్పించిన ఆ వ్యక్తి ఎవరా అని నెటిజన్లు కామెంట్స్ చేయడం గమనార్హం.

ఇదిలా ఉండగా... రజత్ ఆటపై ఆర్సీబీ మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా స్పందించాడు.

రజత్ ఆటకు తాను విస్మయం చెందానని కోహ్లీ పేర్కొన్నాడు. ఐపీఎల్‌ చరిత్రలో నాకౌట్‌ దశలో సెంచరీ చేసిన తొలి అన్‌క్యాప్‌డ్‌ ప్లేయర్‌ పటీదార్‌ అని కోహ్లీ హైలైట్‌ చేశాడు.

"నేను చాలా సంవత్సరాలుగా ఒత్తిడిలో ఎన్నో ఇంపాక్ట్ ఇన్నింగ్స్‌లు, చాలా ఇన్నింగ్స్‌లను చూశాను. ఈరోజు రజత్ ఎలా ఆడాడు అనే దానికంటే మెరుగైనవి నేను చూడలేదు. మొదటి అన్‌క్యాప్డ్ ప్లేయర్, ' అని కోహ్లీ అన్నాడు.

కాగా.. నిజానికి గత సీజన్ వరకు రజత్ పాటిదార్ బెంగళూరులో భాగంగా ఉన్నాడు. కానీ.. మెగా వేలం కారణంగా అాతన్ని రిటైన్ చేయలేదు. అప్పటికీ బెంగళూరు లేదా మరేదైనా జట్టు అతని వేలంపై వేలంలో కచ్చితంగా పందెం కాస్తుందని అనిపించింది. ఆ తర్వాత ఫిబ్రవరి 12, 13 తేదీల్లో మెగా వేలంలో రెండుసార్లు వేలానికి వచ్చినా అతన్ని ఎవరూ కొనుగోలు చేయలేదు. చివరగా.. ఈ యువ బ్యాట్స్ మెన్ ని బెంగళూరు కొనుగోలు చేసింది. కేవలం రూ.20లక్షల బేస్ ప్రైజ్ తో కొనుగోలు చేయడం గమనార్హం.