టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీపై వెస్టిండీస్ లెజెండ‌రీ ప్లేయ‌ర్‌ శివ నారాయణ్‌ చంద్రపాల్ పేర్కొన్నాడు. కోహ్లీపై చంద్రపాల్ ప్రశంసల జల్లు కురిపించాడు.  ప్రస్తుత క్రికెటర్లలో  కోహ్లీనే బెస్ట్ అంటూ ఆయన పేర్కొన్నాడు. 

5 రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్లో ఆడేందుకు చంద్రపాల్ ఇటీవల భారత్‌కి వచ్చాడు. అయితే క‌రోనా వైరస్ కారణంగా ఆ సిరీస్ ర‌ద్దు అయింది. మరోవైపు మీడియాతో తన మనసులోని మాట పంచుకున్న చంద్రపాల్ కోహ్లీని ప్రశంసల్లో ముంచెత్తాడు. చాలా కాలంగా టాప్ లెవెల్ ప్రదర్శిస్తున్న కోహ్లీ.. శ్ర‌మ‌ను గుర్తించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నాడు. మరోవైపు ఈ ఏడాది ఆస్ట్రేలియా జరిగే టీ20 పురుషుల వరల్డ్ కప్ గురించి కూడా ఆస‌క్తిక‌రంగా మాట్లాడాడు.

Also Read ఐసీసీ బెస్ట్ పుల్ షాట్ ట్వీట్: కోపమొచ్చి ట్రోల్ చేసిన రోహిత్ శర్మ...

కోహ్లీ గురించి చంద్రపాల్‌ మాట్లాడుతూ క్రికెట్ లోని అన్ని అంశాల్లో కోహ్లీ రోజురోజుకు మెరుగవుతున్నాడు అని ప్రశంసించాడు. వాటి ఫలితాలను మనం చూస్తున్నామనే విషయాన్ని గుర్తు చేశాడు. ఫిట్‌నెస్‌, స్కిల్స్ పైన చాలా హార్డ్ వర్క్ చేస్తున్నాడని కితాబిచ్చాడు. ఎల్లప్పుడూ అత్యుత్త‌మ ఆట‌తీరు ప్రదర్శించేందుకు కోహ్లీ తహతహలాడుతున్నాడని అభిప్రాయపడ్డాడు. ఇప్పటికే కోహ్లీ తన గురించి తాను నిరూపించుకున్నాడని, ఇకమీదట నిరూపించుకోవాల్సినదేమీ లేదని పేర్కొన్నాడు. క్రికెట్ లో చాలా కాలంగా టాప్ లెవెల్లో ఆడుతున్న కోహ్లీకి క్రెడిట్ ఇవ్వాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించాడు. హార్డ్ వర్క్ పై దృష్టి పెడితే ఫలితాలు వాటంతట అవే వస్తాయని అత‌ను నిరూపించాడని పేర్కొన్నాడు.

ఇక ఈ ఏడాది అక్టోబర్లో ఆస్ట్రేలియా జరిగే టి20 పురుషుల ప్రపంచకప్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ వెస్టిండీస్ రాణించాలని చంద్రపాల్ కోరుకున్నాడు. స్థాయికి తగ్గ ఆటతీరు ప్రదర్శిస్తే వెస్టిండీస్‌కు తిరుగుండదని అభిప్రాయపడ్డాడు.