Virat Kohli IPL Records: రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు స్టార్ ప్లేయ‌ర్ విరాట్ కోహ్లీ ఐపీఎల్ 2024 లో ప‌రుగుల వ‌ర‌ద పారిస్తూ రికార్డుల మోత మోగిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే కింగ్ కోహ్లీ ఐపీఎల్ చ‌రిత్ర‌లో ఒక జ‌ట్టు కోసం అత్య‌ధిక మ్యాచ్ లు ఆడిన ప్లేయ‌ర్ గా స‌రికొత్త రికార్డు సృష్టించాడు.  

Virat Kohli IPL Records: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ ఐపీఎల్ చరిత్రలో 250 మ్యాచ్లు ఆడిన నాలుగో ఆటగాడిగా, ఒకే జట్టు తరఫున ఆడిన ఏకైక ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. ఎంఎస్ ధోనీ, రోహిత్ శర్మ, దినేశ్ కార్తీక్ తర్వాత ఈ ఘనత సాధించిన నాలుగో ఆటగాడిగా కోహ్లీ నిలిచాడు. 

ఐపీఎల్ 2024 లో కింగ్ కోహ్లీ ప‌రుగుల వ‌ర‌ద పారిస్తున్నాడు. ఈ సీజన్ లో ఇప్ప‌టివ‌ర‌కు 13 మ్యాచ్ ల‌ను ఆడిన కోహ్లీ.. 66.10 స‌గ‌టు, 155.16 స్ట్రైక్ రేటుతో 661 పరుగుల‌తో టాప్ స్కోర‌ర్ గా ఉన్నాడు. 

ఐపీఎల్‌లో ఒకే జట్టు కోసం అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ప్లేయ‌ర్లు 

250* - విరాట్ కోహ్లీ (ఆర్సీబీ)
233 - ఎంఎస్ ధోని (సీఎస్కే)
211 - రోహిత్ శర్మ (ముంబై)
189 - కీరన్ పొలార్డ్ (ముంబై)
176 - సురేష్ రైనా (చెన్నై) 
174 - సునీల్ నరైన్ (కేకేఆర్)

అవే మా కోంపముంచాయి.. ఆట‌గాళ్ల‌పై ఢిల్లీ కెప్టెన్ ఫైర్..

Scroll to load tweet…

మొత్తంగా ఐపీఎల్‌లో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ప్లేయ‌ర్లు

263* - ఎంఎస్ ధోని
256 - రోహిత్ శర్మ 
255 - దినేష్ కార్తీక్
250* - విరాట్ కోహ్లీ

రాజ‌స్థాన్ హ్యాట్రిక్ ఓట‌మి.. వారే కార‌ణమంటూ సంజూ శాంస‌న్ ఫైర్..