Virat Kohli Century Innings : ఐపీఎల్ లో విరాట్ కోహ్లీ మరో సూపర్ సెంచరీతో అదరగొట్టాడు. ఐపీఎల్ కెరీర్ లో 8వ రికార్డు సెంచరీ కొట్టాడు కింగ్ కోహ్లీ. రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో వన్ మ్యాన్ షో తో దుమ్మురేపాడు.
Virat Kohli : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్ ) 2024లో విరాట్ కోహ్లీ హవా కొనసాగుతోంది. దుమ్మురేపే ఇన్నింగ్స్ తో అదరగొడుతున్నారు. రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో సెంచరీ కొట్టాడు. దీంతో ఐపీఎల్ 2024లో సెంచరీ కొట్టిన తొలి ప్లేయర్ గా విరాట్ కోహ్లీ నిలిచాడు. అలాగే, తన ఐపీఎల్ కెరీర్ లో ఇది కింగ్ కోహ్లీకి 8వ సెంచరీ కావడం విశేషం. 39 బంతుల్లో హాఫ్ సెంచరీ కొట్టిన విరాట్ కోహ్లీ దానిని సెంచరీగా మలిచాడు. ఈ మ్యాచ్ లో వన్ మ్యాన్ షో తో అదరగొట్టిన విరాట్ కోహ్లీ 133 పరుగులతో అజేయంగా నిలిచాడు. తన ఇన్నింగ్స్ లో 12 ఫోర్లు, 4 సిక్సర్లు బాదాడు.
ఐపీఎల్ 2024 19వ మ్యాచ్ లో జైపూర్ వేదికగా రాజస్థాన్ రాయల్స్-రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడ్డాయి. టాస్ గెలిచిన రాజస్థాన్ టీమ్ బౌలింగ్ ఎంచుకుంది. దీంతో విరాట్ కోహ్లీ, కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ ఆర్సీబీ ఇన్నింగ్స్ ను ప్రారంభించారు. ఇద్దరు మంచి శుభారంభం అందించారు. పవర్ ప్లే లో 50+ స్కోర్ ను సాధించింది. డుప్లెసిస్ 44 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. ఆ తర్వాత బ్యాటింగ్ చేయడానికి వచ్చిన గ్లెన్ మ్యాక్స్ వెల్ మరోసారి నిరాశపరిచాడు. బర్గెర్ బౌలింగ్ లో భారీ షాడ్ ఆడబోయే ఒక్క పరుగుకే క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఈ మ్యాచ్ తో అరంగేట్రం చేసిన సౌరవ్ చౌహాన్ 9 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. పిచ్ స్లో కావడంతో భారీ షాట్లను ఆర్సీబీ సాధించలేకపోయింది. దీంతో ఆర్సీబీ 20 ఓవర్లు ముగిసే సరికి 3 వికెట్లు కోల్పోయి 183 పరుగులు చేసింది.
ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ- ఫాఫ్ డుప్లెసిస్ రికార్డు భాగస్వామ్యంతో మెరిశారు. ఐపీఎల్ 2024 లో అత్యధిక భాగస్వామ్యం నెలకోల్సిన జంటగా నిలిచాడు. వీరిద్దరు 84 బంతుల్లో 125 పరుగులను జోడించారు. ఈ క్రమంలోనే విరాట్ కోహ్లీ తన ఐపీఎల్ కెరీర్ లో 7500 పరుగుల మార్కును అందుకున్నాడు. ఈ మార్కును అందుకున్న తొలి ప్లేయర్ గా ఘనత సాధించాడు.
