Asianet News TeluguAsianet News Telugu

విశ్వరూపం చూపించిన విరాట్ కోహ్లీ... 71వ సెంచరీ వచ్చేసింది...

1000+ రోజుల తర్వాత సెంచరీ మార్కు అందుకున్న విరాట్ కోహ్లీ... టీ20ల్లో మొట్టమొదటి శతకం..

Virat Kohli hits 71st Century, 1st T20I century in Asia Cup 2022
Author
First Published Sep 8, 2022, 8:55 PM IST

ఆసియా కప్ 2022 టోర్నీలో ఫైనల్ రేసు నుంచి తప్పుకున్న భారత జట్టు, పరువు కాపాడుకునేందుకు ఆఫ్ఘాన్‌తో నామమాత్రపు మ్యాచ్‌లో చెలరేగిపోయింది. ఆసియా కప్‌కి ముందు కొన్నాళ్లుగా ఫామ్‌లో లేడని, టీ20లకు పనికి రాడని విమర్శలు ఎదుర్కొన్న కోహ్లీ, పాత విరాట్‌ని తలపిస్తూ విశ్వరూపం చూపించాడు. టీ20ల్లో మొట్టమొదటి సెంచరీ బాదుతూ, ఓవరాల్‌గా ఎన్నో నెలలుగా ఊరిస్తున్న 71వ అంతర్జాతీయ సెంచరీని అందుకున్నాడు....

కెప్టెన్ రోహిత్ శర్మ రెస్ట్ తీసుకోవడంతో కెఎల్ రాహుల్‌తో కలిసి ఓపెనింగ్ చేశాడు విరాట్ కోహ్లీ. మొదటి రెండు ఓవర్లు నెమ్మదిగా బ్యాటింగ్ చేసిన ఈ ఇద్దరూ, మూడో ఓవర్ నుంచి బౌండరీలు బాదడం మొదలెట్టాడు. విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న కొద్దిసేపటికే కెఎల్ రాహుల్ కూడా హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు...

ఈ ఇద్దరూ కలిసి తొలి వికెట్‌కి 119 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పారు. ఆసియా కప్ 2022 టోర్నీలో టీమిండియాకి ఇదే అత్యధిక భాగస్వామ్యం. టీ20ల్లో 100+ సిక్సర్లు పూర్తి చేసుకున్న విరాట్ కోహ్లీ, 3500+ పరుగులను అందుకున్నాడు...

రోహిత్ శర్మ తర్వాత ఈ రెండు ఫీట్‌లు అందుకున్న రెండో భారత క్రికెటర్‌గా నిలిచిన విరాట్ కోహ్లీ, 53 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. టీ20ల్లో మొట్టమొదటి సెంచరీ బాదిన విరాట్ కోహ్లీ, మూడు ఫార్మాట్లలో కలిపి 71వ సెంచరీ నమోదు చేశాడు. 1000+రోజులకు పైగా ఊరిస్తున్న శతకాన్ని అందుకున్న విరాట్ కోహ్లీ... సచిన్ టెండూల్కర్ తర్వాత అత్యధిక సెంచరీలు చేసిన ప్లేయర్‌గా రికీ పాంటింగ్ రికార్డును సమం చేశాడు... 

1021 రోజుల తర్వాత అంతర్జాతీయ సెంచరీ నమోదు చేసిన విరాట్ కోహ్లీ, భారత జట్టుకి భారీ స్కోరు అందించాడు. ఆసియా కప్ 2022 టోర్నీలో ఫైనల్ రేసు నుంచి తప్పుకున్న భారత జట్టు, పరువు కాపాడుకునేందుకు ఆఫ్ఘాన్‌తో నామమాత్రపు మ్యాచ్‌లో చెలరేగిపోయింది. నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 212 పరుగులు చేసింది భారత జట్టు.

కెప్టెన్ రోహిత్ శర్మ రెస్ట్ తీసుకోవడంతో కెఎల్ రాహుల్‌తో కలిసి ఓపెనింగ్ చేశాడు విరాట్ కోహ్లీ. మొదటి రెండు ఓవర్లు నెమ్మదిగా బ్యాటింగ్ చేసిన ఈ ఇద్దరూ, మూడో ఓవర్ నుంచి బౌండరీలు బాదడం మొదలెట్టాడు. విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న కొద్దిసేపటికే కెఎల్ రాహుల్ కూడా హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు...

ఈ ఇద్దరూ కలిసి తొలి వికెట్‌కి 119 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పారు. ఆసియా కప్ 2022 టోర్నీలో టీమిండియాకి ఇదే అత్యధిక భాగస్వామ్యం. టీ20ల్లో 100+ సిక్సర్లు పూర్తి చేసుకున్న విరాట్ కోహ్లీ, 3500+ పరుగులను అందుకున్నాడు...

రోహిత్ శర్మ తర్వాత ఈ రెండు ఫీట్‌లు అందుకున్న రెండో భారత క్రికెటర్‌గా నిలిచిన విరాట్ కోహ్లీ, కెరీర్‌లో 33వ 50+ టీ20 స్కోరు చేసి రోహిత్ శర్మ రికార్డును మరోసారి దాటేశాడు. 

41 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 62 పరుగులు చేసిన కెఎల్ రాహుల్‌ను ఫరీద్ అహ్మద్ అవుట్ చేయగా మొదటి బంతికి సిక్సర్ కొట్టిన సూర్యకుమార్ యాదవ్, ఆ తర్వాతి బంతికి క్లీన్ బౌల్డ్ అయ్యాడు.

51 బంతుల్లో సెంచరీ మార్కు అందుకున్న విరాట్ కోహ్లీ, ఫజల్‌హక్ ఫరూకీ వేసిన ఆఖరి ఓవర్‌లో 6,6,4 బాది... 17 పరుగులు రాబట్టాడు. 61 బంతుల్లో 12 ఫోర్లు, 6 సిక్సర్లతో 122 పరుగులు చేసిన విరాట్ కోహ్లీతో పాటు 16 బంతుల్లో 3 ఫోర్లతో 20 పరుగులు చేసిన రిషబ్ పంత్ నాటౌట్‌గా నిలిచాడు.. టీ20ల్లో టీమిండియాకి విరాట్ కోహ్లీ చేసిన 122 పరుగులే అత్యధిక వ్యక్తిగత స్కోరు. రోహిత్ శర్మ బాదిన 118 పరుగుల రికార్డును అధిగమించాడు విరాట్ కోహ్లీ..

Follow Us:
Download App:
  • android
  • ios