ఇంగ్లాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా ఏడో వికెట్ కోల్పోయింది. 149 బంతుల్లో ఏడు ఫోర్లతో 62 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ, మొయిన్ ఆలీ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు. విరాట్ కోహ్లీ రివ్యూ తీసుకున్నా అంపైర్ కాల్ కావడంతో ఫలితం లేకపోయింది.

రవిచంద్రన్ అశ్విన్‌తో కలిసి ఏడో వికెట్‌కి 177 బంతుల్లో 96 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి అవుట్ అయ్యాడు విరాట్ కోహ్లీ. విరాట్ కోహ్లీ అవుటయ్యే సమయానికి భారత జట్టు 397 పరుగుల ఆధిక్యంలో ఉంది.

తొలి ఇన్నింగ్స్‌లో విరాట్ కోహ్లీని డకౌట్ చేసిన మొయిన్ ఆలీ, రెండో ఇన్నింగ్స్‌లోనూ పెవిలియన్ చేర్చాడు. 2016లో జే పటేల్ తర్వాత ఒకే టెస్టులో రెండు ఇన్నింగ్స్‌ల్లో కోహ్లీని అవుట్ చేసిన బౌలర్‌గా నిలిచాడు మొయిన్ ఆలీ.