ఇటలీలోని టస్కనీలో వీరి వివాహం అత్యంత సన్నిహితుల మధ్య జరగగా... తర్వాత సినీ, క్రికెట్ అభిమానులకు ప్రత్యేకంగా విందు ఇచ్చారు. అయితే... ఈ రెండో పెళ్లి రోజు నాడే కోహ్లీ టీ20 చివరి మ్యాచ్ ఆడాల్సి వచ్చింది. ఆ మ్యాచ్ లో కోహ్లీలో ఇరగదీశాడు. విండీస్ కి చుక్కలు చూపించాడు.

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ.. తన భార్య అనుష్క శర్మకు తమ రెండో పెళ్లి రోజు సందర్భంగా అపురూపమైన బహుమతి అందించాడు. విండీస్ తో జరిగిన టీ20 చివరి మ్యాచ్ లో విజృభించి ఆడిన సంగతి తెలిసిందే. ఆ సీరిస్ ని టీమిండియా కైవసం చేసుకుంది. విండీస్ ని చిత్తు చిత్తుగా ఓడించి...  ట్రీఫీని టీమిండియా సొంతం చేసుకుంది. ఈ విజయాన్నే అనుష్కకు విరాట్ పెళ్లి రోజు కానుకగా అందించాడు.

Scroll to load tweet…
Scroll to load tweet…

రెండు సంవత్సరాల క్రితం సరిగ్గా ఇదే రోజు విరాట్, అనుష్కలు పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు.  ఇటలీలోని టస్కనీలో వీరి వివాహం అత్యంత సన్నిహితుల మధ్య జరగగా... తర్వాత సినీ, క్రికెట్ అభిమానులకు ప్రత్యేకంగా విందు ఇచ్చారు. అయితే... ఈ రెండో పెళ్లి రోజు నాడే కోహ్లీ టీ20 చివరి మ్యాచ్ ఆడాల్సి వచ్చింది. ఆ మ్యాచ్ లో కోహ్లీలో ఇరగదీశాడు. విండీస్ కి చుక్కలు చూపించాడు.

ఈ మ్యాచ్ అనంతరం వ్యాఖ్యాత సంజయ్‌ మంజ్రేకర్‌ అడిగిన ప్రశ్నకు బదులుగా విరాట్‌ మాట్లాడుతూ.. ఇది నాకు చాలా స్పెషల్‌ ఇన్నింగ్స్‌ అని చెప్పాడు. ఇది మా రెండో వెడ్డింగ్‌ యానివర్సరీ. ఈ ఇన్నింగ్స్‌.. నా భార్య అనుష్కా కు నేనిచ్చే అరుదైన బహుమతి అని విరాట్‌ అన్నాడు.

 

అంతేకాకుండా.. సోషల్ మీడియా వేదికగా కూడా తన భార్యపై తనకున్న ప్రేమను విరాట్ తెలియజేశాడు. ఈ దంపతులకు అభిమానులు, నెటిజన్లు కూడా శుభాకాంక్షలు తెలియజేశారు. 


ఫోర్త్‌ ప్లేస్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన విరాట్‌ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 241.38 స్ట్రైక్‌ రేట్‌తో 29 బతుల్లో 70 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. భారత్‌ భారీ స్కోరు సాధించడంలో తనదైన ముద్ర వేశాడు. సిరీస్‌లో అత్యధిక పరుగులు సాధించి మ్యాన్‌ ఆఫ్‌ ది సిరీస్‌ అందుకున్నాడు. మొదట బ్యాటింగ్‌ చేసిన ఇండియా 2 వికెట్లకు గానూ 240 పరుగులు చేసింది. ఓపెనర్లు లోకేష్‌ రాహుల్‌(91), రోహిత్‌(71) అద్భుతంగా రాణించారు. అనంతరం లక్ష్య ఛేదనలో విండీస్‌ 8 వికెట్లు కోల్పోయి, 173 పరుగులు మాత్రమే చేసి, ఓటమి పాలైంది.