Asianet News TeluguAsianet News Telugu

షార్ట్ లెగ్ పొజిషన్‌లో విరాట్ కోహ్లీ ఫీల్డింగ్... భయంతో వికెట్ పారేసుకున్న బంగ్లా బ్యాటర్...

కళ్లు చెదిరే క్యాచ్‌తో షకీబ్ అల్ హసన్‌ని అవుట్ చేసిన విరాట్ కోహ్లీ... హెల్మెట్ ధరించి, ఫార్వర్డ్ షార్ట్ లెగ్ పొజిషన్‌లో ఫీల్డింగ్ చేసిన విరాట్ కోహ్లీ... 

Virat Kohli  fields at forward short leg position with helmet, Bangla batter goes down with
Author
First Published Dec 5, 2022, 2:31 PM IST

టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ... కెప్టెన్సీ నుంచి తప్పుకున్న తర్వాత పేలవ ఫామ్ కారణంగా తీవ్రమైన విమర్శలు ఎదుర్కొన్నాడు. అయితే ఆసియా కప్ 2022 టోర్నీలో ఆఫ్ఘాన్‌పై సెంచరీ చేసి ఫామ్‌ని అందుకున్న విరాట్ కోహ్లీ, టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో నాలుగు హాఫ్ సెంచరీలు చేసి హైయెస్ట్ రన్ స్కోరర్‌గా నిలిచాడు...

వరల్డ్ కప్ తర్వాత న్యూజిలాండ్‌ టూర్‌కి దూరంగా ఉన్న విరాట్ కోహ్లీ, బంగ్లాదేశ్‌‌తో మొదటి వన్డే ద్వారా రీఎంట్రీ ఇచ్చాడు. 15 బంతులాడి ఓ ఫోర్‌తో 9 పరుగులు చేసి బంగ్లా ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్ బౌలింగ్‌లో అవుట్ అయిన విరాట్ కోహ్లీ... బ్యాటింగ్‌లో తీవ్రంగా నిరాశపరిచాడు. వన్డేల్లో విరాట్ కోహ్లీ నుంచి సరైన ఇన్నింగ్స్ వచ్చి రెండేళ్లకు పైనే అవుతోంది...

టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు టాపార్డర్, మిడిల్ ఆర్డర్, లోయర్ ఆర్డర్ ఫెయిల్యూర్ కారణంగా 41.2 ఓవర్లలో 186 పరుగులకి ఆలౌట్ అయ్యింది. కెఎల్ రాహుల్ 70 బంతుల్లో 5 ఫోర్లు,4 సిక్సర్లతో 73 పరుగులు చేసి టీమిండియ తరుపున టాప్ స్కోరర్‌గా నిలిచాడు...

బ్యాటుతో ఫెయిల్ అయినా ఫీల్డింగ్‌లో విరాట్ కోహ్లీ ఓ కళ్లు చెదిరే క్యాచ్ అందుకున్నాడు. 38 బంతుల్లో 3 ఫోర్లతో 29 పరుగులు చేసిన షకీబ్ అల్ హసన్ కొట్టిన షాట్‌ని గాల్లోకి పక్షిలా ఎగురుతూ క్యాచ్ అందుకున్నాడు విరాట్ కోహ్లీ... అంతేకాకుండా హెల్మెట్ ధరించి, షార్ట్ లెగ్ పొజిషన్‌లో ఫీల్డింగ్‌కి రావడం అందర్నీఆశ్చర్యానికి గురి చేసింది...

షార్ట్ లెగ్ పొజిషన్‌లో ఉండే ఫీల్డర్‌కి గాయాలు తగిలే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అందుకే ఈ పొజిషన్‌లో టీమ్‌లో ఉన్న కొత్త కుర్రాళ్లను మాత్రమే ఫీల్డింగ్‌కి పెడతారు. అప్పుడప్పుడూ కెఎల్ రాహుల్, ఈ పొజిషన్‌లో ఫీల్డింగ్ చేయడం కనిపిస్తుంది.

అయితే రిషబ్ పంత్,ఈ వన్డే సిరీస్ నుంచి తప్పుకోవడంతో కెఎల్ రాహుల్ వికెట్ కీపింగ్ చేయాల్సి వచ్చింది. దీంతో స్వయంగా విరాట్ కోహ్లీయే హెల్మెట్‌ వేసుకుని, ఫార్వర్డ్ షాట్ లెగ్ పొజిషన్‌కి వచ్చాడు. విరాట్ కోహ్లీ లాంటి అగ్రెసివ్ క్రికెటర్, హెల్మెట్ వేసుకుని తనవైపు గుర్రుగా చూస్తుంటే ఎలాంటి బ్యాటర్ అయినా ఇబ్బంది పడక తప్పదు. అలాంటిది బంగ్లా యంగ్ బ్యాటర్ల పొజిషన్ ఏంటో అర్థం చేసుకోవచ్చు...

విరాట్ కోహ్లీ ఆ పొజిషన్‌లో ఫీల్డింగ్ చేస్తుండడంతో అటు వైపు ఆడేందుకు భయపడిన బంగ్లా బ్యాటర్ ఎబదత్ హుస్సేన్, 3 బంతులు మాత్రమే ఆడి కుల్దీప్ సేన్ బౌలింగ్‌లో హిట్ వికెట్‌గా పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత హసన్ మహమూద్‌ని సిరాజ్ ఎల్బీడబ్ల్యూగా అవుట్ చేశాడు. 128 పరుగుల వద్ద ఐదో వికెట్ కోల్పోయిన బంగ్లాదేశ్... 8 పరుగుల తేడాలో ఐదు వికెట్లు కోల్పోయి 136/9 స్థితికి చేరుకుంది.

అయితే మెహిడీ హసన్ మియాజ్ 39బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 38 పరుగులు, ముస్తాఫిజుర్ రహ్మన్ 11 బంతుల్లో 2 ఫోర్లతో 10 పరుగులు చేసి ఆఖరి వికెట్‌కి అజేయంగా 51 పరుగులు జోడించి.. బంగ్లాదేశ్‌కి చారిత్రక విజయాన్ని అందించారు.

Follow Us:
Download App:
  • android
  • ios