టీమిండియా ప్రస్తుతం ఇంగ్లాండ్ తో టెస్టు సిరీస్ కోసం తలపడుతున్న సంగతి తెలిసిందే. మొదటి టెస్టు మ్యాచ్ ఓడిపోయినా.. రెండో మ్యాచ్ గెలిచి ప్రతీకారం తీర్చుకున్నారు. టీమిండియా విజయం సంగతి పక్కనబెడితే కెప్టెన్ విరాట్‌‌ కోహ్లి చర్య ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. మ్యాచ్‌ సందర్భంగా కోహ్లి హావభావాలపై నెటిజన్లు సోషల్‌ మీడియాలో మీమ్స్‌, ట్రోల్స్‌తో రెచ్చిపోయారు. 

అసలు విషయంలోకి వెళితే.. రెండో టెస్టు సందర్భంగా టీమిండియా బ్యాటింగ్‌ సమయంలో కోహ్లి డ్రెస్సింగ్‌ రూమ్‌లో కూర్చొని మ్యాచ్‌ వీక్షిస్తున్నాడు. ఇదే సమయంలో తన ఎదురుగా ఏం కనిపించిందో తెలియదుగాని.. కోహ్లి అస్సలు ఇష్టం లేనట్లుగా ఒక ఎక్స్‌ప్రెషన్‌ ఇచ్చాడు.


కోహ్లి ఎక్స్‌ప్రెషన్‌ చూస్తే.. దానిని అసహ్యించుకుంటున్నట్లు తెలుస్తుంది. ఈ ఫోటోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేయగా.. నెటిజన్లు తమదైన మీమ్స్‌, ట్రోల్స్‌తో చెలరేగిపోయారు. 'కోహ్లికి చాయ్‌ ఇష్టం లేనట్లు ఉంది.. అందుకే ముఖాన్ని వికారంగా పెట్టాడు.. జీవితంలో చేసిన తప్పుల గురించి ఆలోచిస్తూ ఎక్కడ తప్పు చేశానో.. రక్షాబంధన్‌ రోజు అబ్బాయిలను స్కూల్‌కు పంపితే ఎలా ఉంటుందో అలా ఉంది కోహ్లి పరిస్థితి' అంటూ రకరకాల మీమ్స్‌ పెట్టేశారు. దీంతో కోహ్లి ఫోటో ట్రెండింగ్‌ లిస్ట్‌లో చేరిపోయింది.