రాజ్‌కోట్ ఎండకి ఇబ్బందిపడిన ఆసీస్ బ్యాటర్లు... డ్యాన్స్ చేస్తూ ఆటపట్టించిన విరాట్ కోహ్లీ..
రాజ్‌కోట్‌లో ఎండలకు ఇబ్బంది పడిన ఆసీస్ బ్యాటర్లు... మార్నస్ లబుషేన్‌ని డ్యాన్స్ చేస్తూ ఆటపట్టించిన విరాట్ కోహ్లీ, వీడియో వైరల్...
గత కొన్ని నెలలుగా టీమిండియా ఎక్కడికి వెళ్లినా వరుణుడు స్వాగతం పలికాడు. అయితే మొదటి వన్డే జరిగిన మొహాలీలో మాత్రం వేడి తట్టుకోలేక తీవ్ర ఇబ్బంది పడ్డారు టీమిండియా బౌలర్లు. శార్దూల్ ఠాకూర్‌తో పాటు మహ్మద్ షమీ, జస్ప్రిత్ బుమ్రా కూడా బౌలింగ్ చేసేటప్పుడు చాలా ఇబ్బంది పడ్డారు. మొహాలీలో పిచ్ బౌలర్లకు సహకరించడంతో ఆసీస్ బౌలర్లు ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయారు.
అయితే రాజ్‌కోట్‌లో సీన్ మారింది. బ్యాటింగ్‌కి అద్భుతంగా అనుకూలించే రాజ్‌కోట్‌లో ఆస్ట్రేలియా బ్యాటర్లు క్రీజులో కుదురుకుపోయారు. మిచెల్ మార్ష్ 96 పరుగులు చేయగా స్టీవ్ స్మిత్ 74, మార్నస్ లబుషేన్ 72, డేవిడ్ వార్నర్ 56 పరుగులు చేసి ఆస్ట్రేలియాకి 352 పరుగుల భారీ స్కోరు అందించారు..
భారత బౌలర్ల కంటే ఎక్కువగా రాజ్‌కోట్‌లో ఎండలు, ఆసీస్ బ్యాటర్లను ఎక్కువగా ఇబ్బంది పెట్టాయి. 74 పరుగులు చేసిన స్టీవ్ స్మిత్, డ్రింక్స్ బ్రేక్‌లో తల మీద ఐస్ ప్యాక్ పెట్టుకుని సేదతీరాడు. ఇదే సమయంలో అక్కడే ఉన్న విరాట్ కోహ్లీ, మార్నస్ లబుషేన్ దగ్గరికి వెళ్లి క్రేజీగా డ్యాన్సులు వేయడం కెమెరాల్లో కనిపించింది.
విరాట్ కోహ్లీ, మార్నస్ లబుషేన్‌ని ఏదో అడగడం, దానికి ఆసీస్ బ్యాటర్ సమాధానం ఇవ్వడం కనిపించింది. అంటే లబుషేన్‌తో విరాట్ కోహ్లీ ఏం మాట్లాడాడో మాత్రం వినిపించలేదు. 11 పరుగులు చేసిన అలెక్స్ క్యారీ ఇచ్చిన క్యాచ్ అందుకున్న విరాట్ కోహ్లీ, క్రేజీగా అరుస్తూ సెలబ్రేట్ చేసుకున్నాడు..
ఎండ, ఉక్కపోతతో తంటాలు పడిన ఆస్ట్రేలియా క్రికెట్ టీమ్‌కి, భారత క్రికెట్ ఫ్యాన్స్‌కి తన స్టైల్‌లో వినోదం పంచాడు విరాట్ కోహ్లీ. మొదటి రెండు వన్డేలకు దూరంగా ఉన్న విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, కుల్దీప్ యాదవ్.. మూడో వన్డే ద్వారా రీఎంట్రీ ఇచ్చారు..
మూడో వన్డేలో టీమిండియా నాలుగు మార్పులతో బరిలో దిగింది. ఇషాన్ కిషన్ వైరల్ ఫివర్‌తో బాధపడుతున్నట్టు రోహిత్ శర్మ ప్రకటించాడు. అలాగే రవిచంద్రన్ అశ్విన్, రిజర్వు బెంచ్‌కే పరిమితం అయ్యాడు. శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమీ రిజర్వు బెంచ్‌కే పరిమితం అయ్యారు.