అతడో స్టార్ క్రికెటర్-ఆమె ఓ బాలీవుడ్ స్టార్...ఇద్దరి మనసులు ఒక్కటయ్యాయి.. ఇంకేముంది ఇద్దరూ జీవితంలో బాగా సెటిలయ్యారు కాబట్టి పెద్దలు సమక్షంలోనే అంగరంగవైభవంగా పెళ్లి చేసుకుని భార్యాభర్తలుగా మారారు. పెళ్లి తర్వాత కూడా ఎంతో అన్యోన్యంగా వుంటూ ఉత్తమ జంటగా పేరు తెచ్చుకున్నారు.  ఆ జంట మరెవరో కాదు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ. 

ఇలా పెళ్లి తర్వాత ఆనందంగా గడుపుతున్న ఈ దంపతులకు ఇవాళ ఓ స్పెషల్ డే. అనుష్క శర్మ పుట్టినరోజు ఇవాళే(మే 1వ తేదీ బుధవారం). అయితే ఐపిఎల్ బిజీ కారణంగా భార్యకు ఎక్కువ సమయాన్ని కేటాయించలేకపోయిన కోహ్లీ ఈరోజు మొత్తాన్ని భార్యతోనే గడిపాడు. ఆర్సిబి మ్యాచులేవీ లేకపోవడంతో భార్యభర్తలిద్దరు ఏకాంతంగా గడిపారు. 

ఎలాంటి హడావుడి లేకుండా భార్య అనుష్కతో  ఒంటరిగా ఓ నీటికొలను వద్ద కూర్చున్న వీడియోను కోహ్లీ ఇన్స్‌స్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు. సాయంత్రం సూర్యుడు అస్తమిస్తుండడాన్ని అలా చూస్తూ ఈ దంపతులు ఏవో ముచ్చట్లు ఆడుకోవడం వీడియోలో కనిపిస్తోంది. అలాగే బ్యాక్ గ్రౌండ్ లో సందర్భానికి తగ్గట్లుగా ఓ హాలీవుడ్ సాంగ్ ఈ వీడియోలో ప్లే అవుతూ వీక్షకులను ఆకట్టుకుంంటోంది. 

ఇలా భార్య పుట్టినరోజు సందర్భంగా గడిపిన మధుర క్షణాలను అభిమానులతో పంచుకున్నాడు కోహ్లీ. ఇలా అభిమాన ఆటగాడు, నటి ఒకే వీడియోలో కనువిందు చేయడంతో అభిమానులు సంబరపడిపోతున్నారు. ఆ వీడియోను తామే వీక్షించడమే కాకుండా ఇతర సోషల్ మీడియా మాద్యమాల్లో పోస్ట్, షేర్ చేస్తుండటంతో వైరల్ గా మారింది. 
 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

♥️ Credit - @suppeerrgram

A post shared by Virat Kohli (@virat.kohli) on May 1, 2019 at 6:54am PDT