మరోసారి డ్రింక్స్ బాయ్‌గా మారిన విరాట్ కోహ్లీ! మున్నా భాయ్‌లా ఉరుకుతూ... వీడియో వైరల్...
Asia Cup 2023: బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో రిజర్వు బెంచ్‌కే పరిమితం అయిన విరాట్ కోహ్లీ... బ్రేక్ సమయంలో డ్రింక్స్ బాయ్ అవతారం ఎత్తిన విరాట్ కోహ్లీ...
విరాట్ కోహ్లీ క్రీజులో ఉంటే ఎంటర్‌టైన్‌మెంట్‌కి కొదవే ఉండదు. బ్యాటింగ్ చేస్తున్నప్పుడు చూడచక్కని కవర్ డ్రైవ్స్, స్టన్నింగ్స్ సిక్సర్లతో అదరగొట్టే విరాట్, ఫీల్డింగ్‌లో కళ్లు చెదిరే క్యాచ్‌లు అందుకుంటాడు. వీటన్నింటికీ బోనస్‌గా డ్యాన్సులు, క్రేజీ స్టెప్పులతో ఫ్యాన్స్‌ని ఎంటర్‌టైన్ చేస్తుంటాడు విరాట్ కోహ్లీ...
నేపాల్‌తో జరిగిన గ్రూప్ మ్యాచ్ సమయంలో విరాట్ కోహ్లీ, నేపాల్ పాటలకు డ్యాన్స్ చేసి, ఆ దేశ క్రికెట్ ఫ్యాన్స్‌కి కూడా తెగ నచ్చేశాడు. తాజాగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న నామమాత్రపు మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ రిజర్వు బెంచ్‌కే పరిమితం అయ్యాడు.
బ్రేక్ సమయంలో డ్రింక్స్ బాయ్ అవతారం ఎత్తిన విరాట్ కోహ్లీ, మహ్మద్ సిరాజ్‌తో కలిసి డ్రింక్స్ తీసుకొచ్చాడు. ఈ సమయంలో ‘హేరాపేరీ’ సినిమాలో అక్షర్ కుమార్‌ని ఇమిటేట్ చేస్తూ రన్నింగ్ చేసి... నవ్వులు పూయించాడు విరాట్.. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది..
ప్రపంచంలో మోస్ట్ ఫాలోయింగ్ క్రికెటర్, ప్రస్తుత తరంలో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా ఉన్న విరాట్ కోహ్లీ... ఇగోలకు పోకుండా ఇలా చేసే ప్రతీ చిన్న ఎంజాయ్ చేస్తూ చేయడం, క్రికెట్ ఫ్యాన్స్‌కి అతన్ని మరింత చేరవ చేస్తోంది.
విరాట్ కోహ్లీ గత 8 వన్డే మ్యాచుల్లో డ్రింక్స్ బాయ్‌గా మారడం ఇది మూడోసారి. వెస్టిండీస్‌తో జరిగిన మొదటి వన్డేలో బ్యాటింగ్‌కి రాని విరాట్ కోహ్లీ, ఆ తర్వాత రెండు వన్డేల్లోనూ రిజర్వు బెంచ్‌కే పరిమితం అయ్యాడు. ఈ సమయంలో డ్రింక్స్ బాయ్‌గా వ్యవహరించాడు కోహ్లీ..
పాకిస్తాన్‌తో జరిగిన మొదటి గ్రూప్ మ్యాచ్‌లో 4 పరుగులు చేసి అవుటైన విరాట్ కోహ్లీ, నేపాల్‌తో జరిగిన మ్యాచ్‌లో బ్యాటింగ్‌కి రాలేదు. పాకిస్తాన్‌తో జరిగిన ఆసియా కప్ సూపర్ 4 మ్యాచ్‌లో 94 బంతుల్లో 122 పరుగులు చేసి... వన్డేల్లో 47వ సెంచరీ అందుకున్నాడు విరాట్ కోహ్లీ..
శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో 3 పరుగులు చేసి అవుటైన విరాట్ కోహ్లీ, బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో మళ్లీ రిజర్వు బెంచ్‌కే పరిమితం అయ్యాడు. గత 8 వన్డేల్లో విరాట్ కోహ్లీ మూడు మ్యాచుల్లో మాత్రమే బ్యాటింగ్‌కి వచ్చాడు. రెండు వన్డేల్లో ఆడినా బ్యాటింగ్‌కి రాని రోహిత్ శర్మ... మూడు మ్యాచుల్లో రిజర్వు బెంచ్‌కి పరిమితం అయ్యాడు..
వరుసగా రెండు విజయాలతో ఆసియా కప్ 2023 ఫైనల్‌కి అర్హత సాధించిన టీమిండియా, బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో ఐదుగురు ప్లేయర్లకు రెస్ట్ ఇచ్చింది. విరాట్ కోహ్లీతో పాటు జస్ప్రిత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, హార్ధిక్ పాండ్యా, కుల్దీప్ యాదవ్ రిజర్వు బెంచ్‌కి పరిమితం అయ్యారు. వీరి స్థానంలో తిలక్ వర్మ, ప్రసిద్ధ్ కృష్ణ, సూర్యకుమార్ యాదవ్, మహ్మద్ షమీ, శార్దూల్ ఠాకూర్ తుది జట్టులోకి వచ్చారు.