భారత సారథి విరాట్ కోహ్లీ రికార్డుల పుస్తకంలో మరో రికార్డు వచ్చి చేరింది. భారత దేశంలో మోస్ట్ వాల్యూబుల్ సెలబ్రిటీగా రికార్డు క్రియేట్ చేశాడు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ. 2020 సెలబ్రిటీ బ్రాండ్ వాల్యూలో టాప్ ప్లేస్‌లో విరాట్ కోహ్లీ నిలవగా, బాలీవుడ్ ఖిలాడీ అక్షర్ కుమార్ రెండో స్థానంలో నిలిచాడు.

అక్షర్ కుమార్ కంటే, విరాట్ కోహ్లీ బ్రాండ్ వాల్యూ డబుల్ ఉండడం మరో విశేషం.2020 ఏడాదిలో విరాట్ కోహ్లీ బ్రాండ్ వాల్యూ 237.7 మిలియన్ డాలర్లు (రూ. 1733.79 కోట్లు) కాగా బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షర్ కుమార్ బ్రాండ్ వాల్యూ 118.9 మిలియన్ డాలర్లు (రూ. 867.26 కోట్లు), మూడో స్థానంలో ఉన్న రణ్‌వీర్ సింగ్ 102.9 మిలియన్ డాలర్ల (రూ.750.4 కోట్లు) బ్రాండ్ వాల్యూతో మూడో స్థానంలో ఉన్నాడు. 

నాలుగో స్థానంలో బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకునే నిలిచింది. అయితే 2019తో పోలిస్తే దీపిక పదుకునే బ్రాండ్ వాల్యూ సగానికి పడిపోవడం విశేషం.