తొమ్మిదో తరగతి విద్యార్థులకు పరీక్షల్లో విరాట్ కోహ్లీకి సంబంధించిన ప్రశ్న అడగడం గమనార్హం. దీనిని ఓ నెటిజన్ సోషల్ మీడియాలో షేర్ చేయగా.... అది కాస్త నెట్టింట వైరల్ గా మారింది.
విరాట్ కోహ్లీ... ఈ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. టీమిండియా మాజీ కెప్టెన్, రన్ మెషిన్ కోహ్లీకి విపరీతమైన క్రేజీ ఫాలోయింగ్ ఉందని స్పెషల్ గా చెప్పక్కర్లేదు. మన దేశంలోనే కాదు... ఇతర దేశాల్లోనూ కోహ్లీకి ఫ్యాన్స్ ఉన్నారు.
క్రికెటర్ గా తనకంటూ ఓ సముచిత స్థానాన్ని ఏర్పరచుకుని ఎంతో మందికి ఆదర్శంగా నిలిచాడు. ఇక అసలుు విషయానికి వస్తే... తొమ్మిదో తరగతి విద్యార్థులకు పరీక్షల్లో విరాట్ కోహ్లీకి సంబంధించిన ప్రశ్న అడగడం గమనార్హం. దీనిని ఓ నెటిజన్ సోషల్ మీడియాలో షేర్ చేయగా.... అది కాస్త నెట్టింట వైరల్ గా మారింది.
@criccrazyjohns అనే సోషల్ మీడియా ఎకౌంట్ ద్వారా ఈ పోస్ట్ ని షేర్ చేశారు. ఆ పోస్ట్‌లో 9వ తరగతికి సంబంధించిన ఇంగ్లీష్ పరీక్ష పేపర్ స్క్రీన్ షాట్‌లో విరాట్ కోహ్లీ గురించిన ప్రశ్న ఉంది. ఆసియా కప్‌లో ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 100 పరుగులు చేసిన కోహ్లీ ఉన్న ఫోటోని ఇచ్చి... దాని గురించి 100 నుంచి 200 పదాల వరకు రాయాలంటూ ప్రశ్న ఇవ్వడం విశేషం.
"9వ తరగతి ఇంగ్లీష్ పరీక్ష కోసం ఒక ప్రశ్న. ఆసియా కప్‌లో ఆఫ్ఘనిస్తాన్‌పై విరాట్ కోహ్లి శతకం తీసిన చిత్రాన్ని చూపుతోంది" అని పోస్ట్ కి క్యాప్షన్ ఇవ్వడం విశేషం.
ఈ పోస్ట్ ఆన్‌లైన్‌లో వైరల్‌గా మారింది. అది మా కోహ్లీ రేంజ్ అంటే అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తుండటం విశేషం.
