Asianet News TeluguAsianet News Telugu

Virat Kohli: యువీ రికార్డును బ్రేక్ చేద్దామనుకున్నావా..? సూర్య రెస్పాన్స్ అదుర్స్

Asia Cup 2022: హాంకాంగ్ తో బుధవారం ముగిసిన మ్యాచ్ లో మిస్టర్ 360 సూర్యకుమార్ యాదవ్ దుమ్మురేపాడు.  26 బంతుల్లోనే 68 పరుగులు చేసి భారత ఇన్నింగ్స్ కు ఊపు తెచ్చాడు. 

Virat Kohli asks Suryakumar Yadav if he thought of hitting 6 sixes, Mister 360 gives Cheeky Response, Watch Video
Author
First Published Sep 1, 2022, 5:38 PM IST

ఆసియా కప్-2022లో భాగంగా బుధవారం దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా ముగిసిన భారత్-హాంకాంగ్ మ్యాచ్ లో  సూర్యకుమార్ యాదవ్ చెలరేగి ఆడాడు. టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లీతో కలిసి అతడు మూడో వికెట్ కు 42 బంతుల్లోనే 98 పరుగులు జోడించాడు. అయితే మ్యాచ్ అనంతరం విరాట్ కోహ్లీ.. సూర్యను ఇంటర్వ్యూ చేశాడు. ఈ సందర్బంగా కోహ్లీ.. సూర్యతో ‘నువ్వు యువరాజ్ సింగ్ ఆరు సిక్సర్ల రికార్డును బ్రేక్ చేద్దామనుకున్నావా..?’ అని అడిగాడు. దానికి సూర్యకుమార్ యాదవ్ అదిరిపోయే సమాధానమిచ్చాడు. 

మ్యాచ్ అనంతరం కోహ్లీ.. సూర్యను ఇంటర్వ్యూ చేశాడు. బీసీసీఐ షేర్ చేసిన ఈ వీడియోలో కోహ్లీ.. ‘నువ్వు చివరి ఓవర్లో వరుసగా నాలుగు సిక్సర్లు  కొట్టావ్. ఆ సమయంలో నువ్వు యువరాజ్ సింగ్ రికార్డును  బద్దలుకొడదామనుకున్నావా..? రెండో భారత బ్యాటర్ గా రికార్డు సృష్టిద్దామనుకున్నావా..?’ అని ప్రశ్నించాడు. 

అప్పుడు సూర్యకుమార్ యాదవ్ బదులిస్తూ.. ‘నేను కూడా అందుకోసం గట్టిగానే  ప్రయత్నించాను.  కానీ యువీ పా ను దాటలేకపోయాను..’ అని చెప్పాడు. దానికి కోహ్లీ.. ‘అది మ్యాజికల్ ఓవర్. బ్రాడ్ బౌలింగ్ ను యువీ పా దుమ్ము దులిపాడు..’ అని అన్నాడు. 

ఇండియా-హాంకాంగ్ మ్యాచ్ లో భారత్ బ్యాటింగ్ చేస్తున్న క్రమంలో చివరి ఓవర్ ను హరూన్ అర్షద్ వేశాడు. ఆ ఓవర్లో సూర్య వరుసగా నాలుగు సిక్సర్లు బాదాడు. ఆ క్రమంలో కోహ్లీతో పాటు టీమిండియా ఫ్యాన్స్ కూడా సూర్య ఆరు సిక్సర్లు కొడతాడని భావించారు. కానీ  హరూన్ ఆ అవకాశమివ్వలేదు.  

 

ఇక ఈ మ్యాచ్ లో సూర్య.. 22 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.  మొత్తంగా 26 బంతుల్లోనే 6 బౌండరీలు, 6 సిక్సర్లతో 68 పరుగులు చేసి హాంకాంగ్ బౌలర్లను ఊచకోత కోశాడు. ఈ మ్యాచ్ లో సూర్య స్ట్రైక్ రేట్ ఏకంగా 261.54గా ఉండటం గమనార్హం. సూర్య రాకముందు భారత స్కోరు 13 ఓవర్లకు 94 పరుగులే ఉండేది. కానీ చివరి ఏడు ఓవర్లలో భారత్.. ఏకంగా 98 పరుగులు సాధించింది. అందులో 68 సూర్యవే కావడం  విశేషం. 

 

Follow Us:
Download App:
  • android
  • ios