టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ- అనుష్క శర్మ దంపతులు తల్లిదండ్రులైన సంగతి తెలిసిందే. సోమవారం అనుష్క పండంటి ఆడపిల్లకు జన్మనిచ్చింది. కాగా.. వీరికి పుట్టిన బిడ్డ ఫోటో ఇదేనంటూ ఇటీవల సోషల్ మీడియాలో ఓ ఫోటో వైరల్ అవుతోంది.

ఈ ఫోటో వైరల్ అవడానికి కారణం కూడా లేకపోలేదు. స్వయానా విరాట్ సోదరుడే ఈ పిక్ షేర్ చేయడంతో అంతా అది నిజమైన విరాట్ కోహ్లీ కూతురి ఫోటో అనుకున్నారు. కానీ వాస్తవానికి విరుష్క జోడికి పాప పుట్టిందని తెలియగానే.. వికాస్ కోహ్లీ వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ.. ఓ చిన్నారి ఫోటో షేర్ చేశారు. కాగా.. ఆ ఫోటోనే అనుష్క విరాట్ కోహ్లీ దంపతుల గారాల పట్టి అంటూ అని అందరూ భావించారు. అయితే.. దీనిపై తాజాగా వికాస్ కోహ్లీ క్లారిటీ ఇచ్చాడు. 

ఆ ఫోటో విరాట్-అనుష్క బిడ్డది కాదు.. ఇదిగో క్లారిటీ..!

అది విరుష్క జోడి కి పుట్టిన పాప ది కాదని.. వారికి శుభాకాంక్షలు చెప్పడానికి ర్యాండమ్ గా ఎంచుకున్న ఫోటో అని.. పాపది కాదని క్లారిటీ ఇచ్చారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియాలో ఓ పోస్టు కూడా పెట్టారు. దీంతో.. ఆ ఫోటోకి సంబంధించిన రూమర్స్ కి చెక్ పడింది. ఇదిలా ఉండగా.. ఇప్పటికే... కోహ్లీ తమకు పాప పుట్టిన ఆనందాన్ని పంచుకోవడంతోపాటు.. తమకు ప్రైవసీ కావాలంటూ పేర్కొన్నారు.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Vikas Kohli (@vk0681)

జనవరి 11న తండ్రి అయిన విరాట్ కోహ్లీ, హీరోయిన్ అనుష్క శర్మ జంటకు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ల వర్షం కురిపిస్తున్నారు క్రికెట్, సినిమా, రాజకీయ సెలబ్రిటీలు. పెటర్నిటీ లీవ్ ద్వారా ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్ మధ్యలో స్వదేశానికి వచ్చిన విరాట్ కోహ్లీ, వచ్చే నెలలో ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్ ద్వారా మళ్లీ రీఎంట్రీ ఇవ్వబోతున్నాడు. క్రికెట్ ప్రపంచంలో ‘కింగ్’గా పిలవబడే విరాట్ కోహ్లీ కూతుర్ని అందరూ ‘లిటిల్ ప్రిన్సెస్’ అని పిలవడం మొదలెట్టేశారు.

విరాట్, అనుష్క శర్మల ఆరాధ్య గురువైన బాబా మహారాజ్ అనంత్, కోహ్లీ బిడ్డకు పేరు పెట్టబోతున్నాడు. వీరి పెళ్లి, కొత్త ఇంటి నిర్మాణం విషయాలను కూడా ఈయనే నిర్ణయించాడు.