భారత సారథి విరాట్ కోహ్లీ ప్రస్తుతం ఆస్ట్రేలియాలో ఉన్నాడు. ఆసీస్‌తో సుదీర్ఘ సిరీస్ కోసం 25 మంది భారత జట్టు సభ్యులతో ఆస్ట్రేలియా చేరిన విరాట్, నేడు క్వారంటైన్‌లోనే దీపావళి వేడుకలు జరుపుకున్నాడు. యూఏఈలో తనవెంటే ఉన్న సతీమణి అనుష్క శర్మ, డెలివరీ కోసం స్వదేశం చేరింది.

భార్యకు దూరంగా దాదాపు రెండు నెలలు గడపబోతున్న విరాట్ కోహ్లీ... ఆసీస్‌తో మొదటి టెస్టు ముగిసిన తర్వాత స్వదేశం తిరిగి రానున్నాడు. దీపావళి సందర్భంగా అభిమానులకు శుభాకాంక్షలు తెలుపుతూ వీడియో విడుదల చేశాడు విరాట్ కోహ్లీ... ‘దయచేసి టపాకాయలు కాల్చకండి. దీపాలు వెలిగించి, స్వీట్లు పంచుకుని దీపావళి వేడుకలు జరుపుకోండి...’ అంటూ వీడియోలో తెలిపాడు విరాట్.

 

 

వీరితో పాటు క్రికెటర్లు ఇర్ఫాన్ పఠాన్, యజ్వేంద్ర చాహాల్, శ్రేయాస్ మరియు తదితర క్రికెటర్లు కూడా దీపావళి శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్లు చేశారు.


సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్‌తో పాటు కోచ్ వీవీఎస్ లక్ష్మణ్ కూడా పండగ శుభాకాంక్షలు తెలిపారు. 


వీరేంద్ర సెహ్వాగ్ మాత్రం గణపతి సమేత లక్ష్మీదేవి ఫోటోను పోస్టు చేసి దీపావళి పండగ శుభాకాంక్షలు తెలియచేశారు...


బ్యాడ్మింటన్ ప్లేయర్ సైనా నెహ్వాల్, తన తల్లిదండ్రులతో కలిసి వీడియో ద్వారా దీపావళి శుభాకాంక్షలు తెలియచేసింది. 


ఫుట్‌బాల్ క్లబ్స్ మాంచెస్టర్ సిటీ, లివర్‌పూల్ కూడా దీపావళి శుభాకాంక్షలు తెలియచేస్తూ ట్వీట్లు చేయడం విశేషం...