ప్రస్తుతం ఎక్కడ విన్నా.. టీమిండియా యువ క్రికెటర్ ఇషాన్ కిషన్ పేరు వినపడుతోంది.  తొలి మ్యాచ్ లోనే హాఫ్ సెంచరీ కొట్టి.. జట్టు విజయానికి సహకరించాడు. ఇంగ్లాండ్ తో రెండో టీ20తో అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగుపెట్టిన ఇషాన్.. మెరుపు ఇన్నింగ్స్ తో అదరగొట్టాడు.

అయితే.. ఆ మ్యాచ్ లో రషీద్ బౌలింగ్ లో వరసగా రెండో బౌలింగ్ లో వరసగా రెండు సిక్సర్లు కొట్టి.. హాఫ్ సెంచరీ చేరుకున్న తర్వాత సంబరాలు చేసుకునేందుకు అతను వెంటనే బ్యాట్ పైకి ఎత్తలేదు. అందుకు గల కారణాన్ని ఇషాన్.. చాహల్ చేసిన ఇంటర్వ్యూలో తెలియజేశాడు.

‘‘ నిజం చెప్పాలంటే మ్యాచ్ లో నేను హాఫ్ సెంచరీ చేశానని నాకు తెలీదు. గొప్ప ఇన్నింగ్స్ ఆడావని కోహ్లీ నాతో అన్న తర్వాతే నాకు అర్థమయ్యింది. కానీ హాఫ్ సెంచరీ తర్వాత నాకు బ్యాట్ ఎత్తే అలవాటు లేదు. కానీ కోహ్లీ.. బ్యాట్ ఎత్తి.. అందరికీ చూపించు.. నీ ఫస్ట్ ఇంటర్నేషనల్ మ్యాచ్ కాబట్టి అందరికీ  గుర్తుంటుంది. బ్యాట్ చూపించు అంటూ కోహ్లీ అరిచాడు. అందుకే  వెంటనే బ్యాట్ ఎత్తి అభివాదం చేశాను. కెప్టెన్ ఆదేశం కాబట్టి చేశాను కానీ అలా చేయడం చాలా మంచి అనుభూతిని ఇచ్చింది.’’ అని పేర్కొన్నాడు.