టీమిండియా క్రికెటర్ విజయ్ శంకర్ పెళ్లి పీటలెక్కాడు.  గతడేది ఆగస్టులో నిశ్చితార్థం చేసుకున్న ఆయన.. తాజాగా.. పెళ్లి చేసుకొని ఓ ఇంటివాడయ్యారు. వైశాలి విశ్వేశ్వరన్ ను ఆయన వివాహం చేసుకున్నాడు. దీనికి సంబంధించిన ఫోటోలు అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.

సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు.. ఈ సందర్భంగా కొత్త దంపతులకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేశారు. ‘ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ విజయ్’ అంటూ సోషల్ మీడియాలో పోస్టుపెట్టారు. దానికి ఆరెంజ్ ఆర్మీ అనే ట్యాగ్ కూడా ఇవ్వడం గమనార్హం.

కాగా... గతేడాది ఆగస్టులో నిశ్చితార్థం చేసుకున్న ఫోటోలను ఆయన సోషల్ మీడియాలో షేర్ చేయగా.. అవి వైరల్ అయ్యాయి. ఎంగేజ్మెంట్ అయిపోయిన తర్వాత ఆ ఫోటోలను షేర్ చేశాడు. వైశాలి విశ్వేశ్వరన్‌తో కలిసి ఉన్న ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసి.. ఎంగేజ్‌మెంట్ జరిగిందని అర్థం వచ్చేలా ఉంగరం ఎమోజి జతచేశాడు. ఈ పోస్టుకు కామెంట్ల రూపంలో టీమిండియా క్రికెటర్లు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కేఎల్ రాహుల్, యుజ్వేంద్ర చాహల్‌తో పలువురు ఆటగాళ్లు కంగ్రాట్స్ బ్రో అని కామెంట్ చేశారు.

 

జయ్‌ శంకర్‌ 2018లో భారత జట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు. కొలంబోలో జరిగిన శ్రీలంక- భారత్‌ టీ 20 మ్యాచ్‌తో భారత జట్టులో అడుగుపెట్టాడు. ఆ తర్వాత ఏడాదికి మెల్‌బోర్నోలో ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే మ్యాచ్‌తో వన్డే జట్టులోకి వచ్చాడు. టీమిండియా తరఫున ఇప్పటి వరకు 12 వన్డేలు, తొమ్మిది టీ 20లు ఆడాడు విజయ్ శంకర్.