ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టెస్టు జరిగిన మెల్‌బోర్న్‌లో భాగ్యనగర పరిమళాలు గుబాలించాయి. తెలుగు కుర్రాడైన హనుమ విహారి... తెలుగులో ప్రేక్షకులకు సమాధానం ఇచ్చిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా... మరో హైదరాబాద్ మహ్మద్ సిరాజ్‌ను, మాజీ హైదరాబాదీ క్రికెటర్, భారత ఫీల్డింగ్ కోచ్ ఆర్. శ్రీధర్ చేసిన ఇంటర్వ్యూ పక్కా హైదరబాదీ యాషలో సాగింది...

నాలుగో రోజు బౌండరీ లైన్ దగ్గర ఫీల్డింగ్ చేస్తున్న హనుమ విహారితో ఓ తెలుగు అభిమాని... ‘బోర్ కొడుతోంది... తొందరగా అవుట్ చేసేయండి...’ అంటూ కామెంట్ చేశాడు. దానికి స్పందించిన హనుమ విహారి... ‘అవుట్ చేస్తే మ్యాచ్ అయిపోతుందిగా...’ అంటూ సమాధానం ఇచ్చాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

హైదరాబాదీ క్రికెటర్ అయిన సిరాజ్‌ను ఆర్ శ్రీధర్, హైదరాబాద్ హిందీ యాషలోనే చేసిన ఇంటర్వ్యూ కూడా సోషల్ మీడియాలో మంచి ఆదరణ తెచ్చుకుంది. హనుమ విహారి రెండో టెస్టులో 21 పరుగులు మాత్రమే చేయడంతో సిడ్నీ టెస్టులో ఆడతాడా? లేదా? అనేది అనుమానంగా మారింది.