న్యూడిల్లీ: టీమిండియా మాజీ క్రికెటర్ యూసఫ్ పఠాన్ కరోనా బారినపడ్డారు. కరోనా లక్షణాలు కనిపించడంతో టెస్ట్ చేయించుకున్నానని... దీంతో పాజిటివ్ గా నిర్దారణ అయినట్లు యూసఫ్ ప్రకటించారు. ఈ క్రమంలో తాను హోం ఐసోలేషన్ లోకి వెళ్లినట్లు తెలిపారు. అవసరమైన నిబంధనలు పాటిస్తూనే వైద్యులు సూచించిన మెడిసిన్స్ వాడుతున్నట్లు పఠాన్ వెల్లడించారు. ఇటీవలి కాలంలో తనను కలిసిన వారంతా త్వరగా పరీక్షలు చేయించుకోవాలని యూసఫ్ పఠాన్ విజ్ఞప్తి చేశాడు.

 

అంతకు ముందు కరోనాతో బాధపడుతున్న ఇండియన్ దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ వేగంగా కోలుకోవాలని కోరుకుంటున్నట్లు యూసఫ్ ట్వీట్ చేశారు. అప్పర్ కట్ షాట్ తో కరోనా వైరస్ ను మైదానం బయటకు తరలించాలని భావిస్తున్నట్లు యూసఫ్ తెలిపారు. 

read more  సచిన్ టెండూల్కర్‌కి కరోనా పాజిటివ్... సోషల్ మీడియా ద్వారా ప్రకటించిన మాస్టర్...

గత వారం ఉత్తరప్రదేశ్ లోని లక్నోలో టీమిండియా మాజీ క్రికెటర్లు ఇర్ఫాన్ పఠాన్, యువరాజ్, సెహ్వాగ్, కైఫ్ వంటి ఆటగాళ్లతో కూడిన జట్టుతో కలిసి రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ ఆడాడు సచిన్ టెండూల్కర్. తాను 200 టెస్టులు ఆడితే, 277 కరోనా టెస్టులు చేయించుకున్నానని కూడా తెలిపాడు మాస్టర్ బ్లాస్టర్. ఇలా అప్రమత్తంగా వుంటూ ఇంతకాలం కరోనాను ధరిచేరకుండా జాగ్రత్తపడ్డ సచిన్ చివరకు కరోనా బారిన పడ్డారు. తాజాగా యూసఫ్ కూడా ఈ మహమ్మారి బారిన పడ్డారు.