ఇంగ్లాండ్ వేదికగా ప్రతిష్టాత్మకంగా జరగనున్న ప్రపంచ కప్ కోసం అన్ని అంతర్జాతీయ క్రికెట్ జట్లు సిద్దమయ్యాయి. ఆటగాళ్లకు ప్రత్యేక శిక్షణ, ప్రత్యర్థి జట్లను దెబ్బ తీసేందుకు వ్యూహరచనలు చేస్తూ బిజీబిజీగా గడుపుతున్నాయి. ఇలా అన్ని జట్లు ఈ మెగా టోర్నీ కోసం ముందస్తు ప్రణాళికలతో దూసుకుపోతుంటే భారత జట్టు ఇంకా ఐపిఎల్ మూడ్ నుండి బయయటకు రాలేకపోతోంది. కనీసం గత మ్యాచుల అనుభవం దృష్ట్యా మిడిల్ ఆర్ఢర్ సమస్యలు ముఖ్యంగా నాలుగో స్థానంలో ఎవరిని బరిలోకి దించాలన్న దానిపై ఇంకా ఓ క్లారిటీకి రాలేకపోతోంది. దీంతో టీమిండియా మాజీ చీఫ్ సెలెక్టర్ వెంగ్ సర్కార్ ఈ సమస్య పరిష్కారంకోసం ఓ సలహా ఇచ్చాడు.

ఐపిఎల్ లో కింగ్స్ లెవెన్ పంజాబ్ తరపున ఓపెనర్ గా బరిలోకి దిగి అదరగొట్టిన కేఎల్ రాహుల్ నాలుగో స్థానంలో బ్యాటింగ్ కు సరిగ్గా సరిపోతాడని తెలిపారు. అతడి టెక్నికల్ బ్యాటింగ్ ఇంగ్లాండ్ పిచ్ లపై చాలా బాగా పనిచేస్తుందన్నారు. ఇలా అతడిని గనుక టీమిండియా మేనేజ్ మెంట్ నాలుగో స్థానంలో బరిలోకి దించితే మిడిల్ ఆర్డర్ వైఫల్యమనే సమస్యే వుండదని వెంగ్ సర్కార్ వెల్లడించారు.
రాహుల్ ఓపెనర్ గా కూడా చాలా చక్కగా ఆడతాడు. కాబట్టి అవసరం అనుకుంటే అతన్ని ఓపెనర్ గా కూడా బరిలోకి దించొచ్చు. శిఖర్ ధావన్, రోహిత్ లు ఓపెనర్లుగా బరిలోకి దిగితే మాత్రం మూడో స్థానంలో కెప్టెన్ కోహ్లీ, నాలుగో స్థానంలో రాహుల్ బరిలోకి దిగితే బావుంటుందని...ఈ బ్యాటిగ్ ఆర్డర్ వల్ల టీమిండియా ప్రపంచ కప్ లో మెరుగైన ఫలితాల్ని రాబట్టగలదని వెంగ్ సర్కర్ అభిప్రాయపడ్డారు.
ఇక ఇంగ్లాండ్ గడ్డపై జరుగుతున్న ఈ ప్రపంచకప్ లో ఆతిథ్య జట్టుతో పాటు భారత్, ఆస్ట్రేలియాలు హాట్ ఫేవరెట్లుగా బరిలోకి దిగుతున్నాయన్నారు. ఈ మూడు జట్లు సెమీస్ చేరడం ఖాయయమని...ఇందులోనే ఒక జట్టు ప్రపంచ కప్ 2019 ని ఎగరేసుకు పోతుందని వెంగ్ సర్కార్ జోస్యం చెప్పారు.