ప్రపంచ కప్ టోర్నీలో టీమిండియా అద్భుతంగా ఆడినప్పటికి సెమీస్ లోనే ఇంటిదారి పట్టిన విషయం తెలిసిందే. టోర్నీలీగ్ దశలో అదరగొట్టి పాయింట్స్ టేబుల్ లో టాప్ లో నిలిచిన భారత జట్టు నాలుగో స్థానంలో నిలిచిన న్యూజిలాండ్ చేతిలో ఓటమిపాలయ్యింది. ఇలా టీమిండియా నిష్ర్కమించడానికి వాతావరణ పరిస్థితులు ఒక కారణమయితే అతి విశ్వాసం కూడా మరో కారణమని మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ ఆరోపించారు.

''ముఖ్యంగా లీగుల్లో వరుస విజయాలు, పాయింట్స్ టేబుల్లో టాప్ కు చేరడం భారత ఆటగాళ్లకు అతి విశ్వాసం కలిగింది. దీంతో తాము ఎలాంటి పరిస్థితుల్లో అయినా ఆడగలమన్న స్థాయికి అది చేరింది. అయితే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల పైనే ఎక్కువగా ఆదారపడుతున్న విషయాన్ని గుర్తించలేకపోయారు. అలా గుర్తించే సమయానికి టీమిండియా టోర్నీ నుండే బయటకు వచ్చింది. 

అయితే ఈ సెమీఫైనల్లో జడేజా(77 పరుగులు), ధోని(50) ల ధోని అద్భుతంగా ఆడింది. కానీ ధోని ఇంకొంచెం ముందు వచ్చి వుంటే మరిన్ని పరుగులు సాధించే అవకాశముండేది. పూర్తిగా చివర్లో బ్యాటింగ్ కు దిగడం వల్ల అతడు చాలా ఒత్తిడితో బ్యాటింగ్ చేయాల్సి వచ్చింది. కాబట్టి కీలక సమయంలో పరుగుల వేగాన్ని పెంచడానికి ప్రయత్నించి ఎప్పుడూ లేని విధంగా రనౌటయ్యాడు.'' అని గవాస్కర్ భారత్ ప్రపంచ  కప్ మిస్సవడానికి  గల కారణాలను వివరించాడు.