4 రోజుల్లో 3 హ్యాట్రిక్‌లు...అమెరికాపై విధ్వంసంతో సెమీస్ చేరిన ఇంగ్లండ్
ENG vs USA: టీ20 ప్రపంచ కప్ 2024 49వ మ్యాచ్‌లో అమెరికాను చిత్తుగా ఓడించింది ఇంగ్లండ్ జట్టు. దీంతో సెమీస్ బెర్త్ ను కన్ఫార్మ్ చేసుకుంది. అలాగే, ఈ మ్యాచ్ లో హ్యాట్రిక్ వికెట్లు తీసుకుని క్రిస్ జోర్డాన్ చరిత్ర సృష్టించాడు.
USA vs ENG T20 World Cup 2024 : టీ20 ప్రపంచ కప్ 2024 లో ఇంగ్లండ్ సెమీస్ బెర్త్ ను కన్ఫార్మ్ చేసుకుంది. టీ20 ప్రపంచ కప్ 2024 49వ మ్యాచ్‌లో అమెరికాను చిత్తుగా ఓడిచింది. ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్ బౌలర్లు అదరగొట్టారు. ఈ ప్రపంచ కప్ లో 4 రోజుల్లోనే మూడోసారి హ్యాట్రిక్ రావడం విశేషం. బార్బడోస్‌లో జరిగిన సూపర్-8 మ్యాచ్‌లో ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో మొదట బ్యాటింగ్ చేసిన అమెరికా జట్టు 18.5 ఓవర్లలో 115 పరుగులకే కుప్పకూలింది. ఇంగ్లండ్ తరఫున ఫాస్ట్ బౌలర్ క్రిస్ జోర్డాన్ అత్యధికంగా 4 వికెట్లు పడగొట్టి చరిత్ర సృష్టించాడు. ఈ మ్యాచ్ లో యూఎస్ఏ 115 పరుగులకు ఆలౌట్ అయింది. ఇంగ్లాండ్ జట్టు 9.4 ఓవర్లలో ఒక్క వికెట్ కోల్పోకుండానే 117 పరుగులతో విజయాన్ని అందుకుంది. జోస్ బట్లర్ 83 పరుగులతో సూపర్ ఇన్నింగ్స్ ఆడాడు.
క్రిస్ జోర్డాన్ హ్యాట్రిక్..
టీ20 ప్రపంచ కప్ 2024 లో 4 రోజుల్లోనే మూడో హ్యాట్రిక్ నమోదైంది. 19వ ఓవర్లో క్రిస్ జోర్డాన్ హ్యాట్రిక్ వికెట్ తీశాడు. అతను మూడో బంతికి అలీఖాన్‌ను, నాలుగో బంతికి నోస్తుష్ కెంజిగేను, ఐదో బంతికి సౌరభ్ నేత్రవాల్కర్‌ను అవుట్ చేశాడు. టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ తరఫున హ్యాట్రిక్ సాధించిన తొలి బౌలర్‌గా జోర్డాన్ నిలిచాడు. టీ20 ప్రపంచకప్‌లో నాలుగు రోజుల్లో ఇది మూడో హ్యాట్రిక్. అంతకు ముందు పాట్ కమిన్స్ బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్‌లపై వరుసగా రెండు హ్యాట్రిక్ లను నమోదుచేశాడు.
పురుషుల టీ20 ప్రపంచకప్‌లో హ్యాట్రిక్ సాధించిన బౌలర్లు వీరే..
బ్రెట్ లీ (ఆస్ట్రేలియా) vs బంగ్లాదేశ్, కేప్ టౌన్, 2007
కర్టిస్ కాంఫర్ (ఐర్లాండ్) vs నెదర్లాండ్స్, అబుదాబి, 2021
వనిందు హసరంగా (శ్రీలంక) vs దక్షిణాఫ్రికా, షార్జా, 2021
కగిసో రబడ (దక్షిణాఫ్రికా) vs కార్తీక్ 2021, ఇంగ్లాండ్,
షార్జా మెయ్యప్పన్ (UAE) vs శ్రీలంక, గీలాంగ్, 2022
జాషువా లిటిల్ (ఐర్లాండ్) vs న్యూజిలాండ్, అడిలైడ్, 2022
పాట్ కమ్మిన్స్ (Aus) vs బంగ్లాదేశ్, నార్త్ సౌండ్, 2024
పాట్ కమ్మిన్స్ (Aus) vs ఆఫ్ఘనిస్తాన్, కింగ్‌స్‌టౌన్
క్రిస్ జోర్డాన్ (ఇంగ్లాండ్) vs USA , బ్రిడ్జ్‌టౌన్, 2024
దక్షిణాఫ్రికాను వైట్‌వాష్ చేసిన టీమిండియా.. స్మృతి మంధాన సరికొత్త రికార్డు
జోర్డాన్ పేరిట మరో రికార్డు
జోర్డాన్ 19వ ఓవర్లో మొత్తం 4 వికెట్లు తీశాడు. టీ20 ప్రపంచకప్‌లో ఒకే ఓవర్‌లో 4 వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా ఘనత సాధించాడు. అతని కంటే ముందు కర్టిస్ కాంఫర్ 2021లో ఈ రికార్డు సాధించాడు. ఈ ఐరిష్ బౌలర్ 2021 టీ20 ప్రపంచ కప్ లో అబుదాబిలో నెదర్లాండ్స్‌పై ఒకే ఓవర్ లో నాలుగు వికెట్లు తీసుకున్నాడు.
పరుగులేమీ చేయకుండానే 5 వికెట్లు కోల్పోయిన అమెరికా
అమెరికా జట్టు 5 వికెట్లకు 115 పరుగులు చేసింది. ఈ క్రమంలోనే మంచి స్కోర్ చేస్తుందని అనిపించింది. కానీ, చివరి 5 వికెట్లు ఒక్క పరుగు చేయకుండానే కోల్పోయింది అమెరికా క్రికెట్ జట్టు. 115 పరుగులకే ఆలౌట్ అయింది. టీ20 ఇంటర్నేషనల్‌లో ఒకే స్కోరుపై ఒక జట్టు 5 వికెట్లు పడటం ఇది మూడోసారి. అంతకుముందు 2010లో పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా చివరి 5 వికెట్లకు 191 పరుగుల స్కోరు వద్ద పతనమైంది. అదే సమయంలో 2022లో కెన్యాపై మాలి 8 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. ఒకానొక సమయంలో మాలి స్కోరు 1 వికెట్‌కు 8 పరుగులు. తర్వాత 6 వికెట్లకు 8 పరుగుల వద్దనే పడ్డాయి.