Asianet News TeluguAsianet News Telugu

ఓరి నీ... ఆ పేపర్‌లో ఉంది అదా! షాకింగ్ విషయం చెప్పిన గుజరాత్ టైటాన్స్ కోచ్ ఆశీష్ నెహ్రా...

ఐపీఎల్ 2022 సీజన్‌లో గుజరాత్ టైటాన్స్‌కి హెడ్ కోచ్‌గా ఆశీష్ నెహ్రా... ఐపీఎల్ టైటిల్ గెలిచిన మొట్టమొదటి భారత హెడ్ కోచ్‌గా రికార్డు... 

us paper me sirf menu tha, Gujarat titans head coach Ashish Nehra reveals IPL 2022 top Secret
Author
First Published Sep 19, 2022, 1:27 PM IST

ఐపీఎల్ 2022 ఆరంభంలో గుజరాత్ టైటాన్స్ టైటిల్ గెలుస్తుందని ఎవ్వరూ ఊహించలేదు. ఈ టీమ్ ఆఖరి పొజిషన్‌లో నిలవకుండా తప్పించుకుంటే... అదే పెద్ద అఛీవ్‌మెంట్ అనుకున్నారు. అయితే టోర్నీ ఆరంభమయ్యాక ఈ అంచనాలన్నీ తలకిందులయ్యాయి. అండర్ డాగ్స్‌గా బరిలో దిగిన గుజరాత్ టైటాన్స్ జట్టు, మొట్టమొదటి సీజన్‌లోనే ఐపీఎల్ టైటిల్ విన్నర్‌గా నిలిచింది...

ఐపీఎల్ టైటిల్ గెలిచిన మొట్టమొదటి భారత కోచ్‌గా రికార్డు క్రియేట్ చేశాడు భారత మాజీ క్రికెటర్ ఆశీష్ నెహ్రా. కేకేఆర్ హెడ్ కోచ్ బ్రెండన్ మెక్‌కల్లమ్, లక్నో సూపర్ జెయింట్స్ హెడ్ కోచ్ ఆండ్రూ ఫ్లవర్ వంటి విదేశీ కోచ్‌లు సిస్టమ్స్ ముందు వేసుకుని, లెక్కలు వేస్తూ, వ్యూహ రచన చేస్తూ కనిపించారు...

ఆశీష్ నెహ్రా మాత్రం సింపుల్‌గా ఓ పెన్ను, పేపర్‌తో కనిపించి, సూపర్ కూల్ హెడ్ కోచ్‌గా సోషల్ మీడియా జనాల మనసులు దోచేశాడు. టీమిండియా మాజీ క్రికెటర్ వసీం జాఫర్ కూడా అందరూ కంప్యూటర్లతో కుస్తీ పడుతుంటే... ఆశీష్ నెహ్రా సింపుల్‌లో ఓ పెన్సిల్, పేపర్‌తో టైటిల్ కొట్టేశాడని పోస్టు చేశాడు...

అందరూ ఆశీష్ నెహ్రా చేతిలో ఉన్న ఆ పేపర్‌లో మ్యాచులు గెలవడానికి కావాల్సిన వ్యూహ్యాలు, తుద జట్టు లెక్కలు, ఎవ్వరినీ ఎలా అవుట్ చేయాలనే ప్లాన్స్ రాశాడేమోనని అనుకున్నారు. అయితే ఆ పేపర్ ముక్కలో ఏముందో తాజాగా బయటపెట్టాడు ఆశీష్ నెహ్రా...

‘ఆ పేపర్‌లో అంతగా ఏమీ లేదు. అందరూ ఆ  కాగితంలో ఏదో ముఖ్యమైనది ఉందని ఎందుకు అనుకున్నారో తెలీదు. అందుకే ప్రాక్టీస్ సెషన్స్‌లో ఏం చేయాలో, ఏం తినాలో మెనూ మాత్రమే ఉంది... ’ అంటూ కుండబద్ధలు కొట్టాడు ఆశీష్ నెహ్రా..

ఇన్నాళ్లు అందులో అది ఉంది, ఇది ఉంది... అంటూ ఎన్నో ఊహాగానాలు వేసుకున్న ఐపీఎల్ ఫ్యాన్స్, ఆ పేపర్ ముక్కలో ఉన్నది మెనూ అని తెలుసు... షాక్ అవుతున్నారు. 

‘నేను సూపర్ కోచ్‌ని కాదు. నేను కూడా మీలాగే బయట కూర్చొని ఓ సాధారణ ప్రేక్షకుడిలా మ్యాచ్ ఎంజాయ్ చేస్తా. టీమ్ గెలిచినప్పుడు అందరూ ఆహా... ఓహో అని ఇలా మాట్లాడతారు. ఓడితే అతను ఎందుకు పనికి రాడంటూ తేల్చి పడేస్తారు...

ప్రతీ కోచ్ కూడా టీమ్‌ని గెలిపించడానికి చాలా కష్టపడతాడు. మెంటల్‌గా, ఫిజికల్‌గా వారి శ్రమని వెలకట్టలేం. అయితే అన్నిసార్లు అనుకున్న రిజల్ట్ రాదు. గుజరాత్ టైటాన్స్ మొదటి సీజన్‌లోనే అద్భుతమైన ప్రదర్శనతో టైటిల్ గెలవడం చాలా సంతోషంగా ఉంది...’ అంటూ కామెంట్ చేశాడు గుజరాత్ టైటాన్స్ హెడ్ కోచ్, టీమిండియా మాజీ క్రికెటర్ ఆశీష్ నెహ్రా...

గ్రూప్ స్టేజీలో 14 మ్యాచుల్లో 10 విజయాలు అందుకుని గ్రూప్ టాపర్‌గా నిలిచిన గుజరాత్ టైటాన్స్, మొదటి క్వాలిఫైయర్‌లో రాజస్థాన్ రాయల్స్‌ని ఓడించి నేరుగా ఫైనల్ చేరింది. ఆ తర్వాత రెండో క్వాలిఫైయర్‌లో గెలిచి ఫైనల్ చేరిన రాజస్థాన్ రాయల్స్... ఫైనల్‌లో మరోసారి గుజరాత్ టైటాన్స్ చేతుల్లో ఓడింది...

గుజరాత్ టైటాన్స్ తరుపున బ్యాటుతో 487 పరుగులు, బౌలింగ్‌లో 8 వికెట్లు తీసిన హార్ధిక్ పాండ్యా, ఈ పర్ఫామెన్స్‌తో టీమిండియాలోకి ఘనమైన రీఎంట్రీ ఇచ్చాడు. 

Follow Us:
Download App:
  • android
  • ios