Asianet News TeluguAsianet News Telugu

పంత్ పక్కనపెట్టడంతో పాకిస్తాన్ యువపేసర్‌పై కన్నేసిన ఊర్వశి రౌతేలా..? ఇన్‌స్టాలో వీడియో పోస్టు చేసి మరీ..!

Urvashi Rautela-Naseem Shah: టీమిండియా వికెట్ కీపర్ రిషభ్ పంత్ తో బ్రేకప్ అయ్యాక  విరహ వేదన అనుభవిస్తున్న బాలీవుడ్  వర్ధమాన నటి ఊర్వశి రౌతేలా పాకిస్తాన్ యువ పేసర్ తో ప్రేమలో పడిందా..?

Urvashi Rautela Posts Edited Video of Herself with Pakistan Sensitisation Naseem Shah, Fans calls Fallen Love With Him
Author
First Published Sep 7, 2022, 12:07 PM IST

రిషభ్ పంత్ తో పీకల్లోతు ప్రేమలో మునిగి ఆ తర్వాత బ్రేకప్ అయ్యాక విరహ వేదనతో ఉన్న బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా  మళ్లీ ప్రేమలో పడిందా..?  పాకిస్తాన్ యువ పేసర్ నసీమ్ షా బౌన్సర్లకు ఈ అమ్మడు క్లీన్ బౌల్డ్ అయిందా..?  తాజాగా ఊర్వశి ఇన్స్టాగ్రామ్ పోస్టు చూస్తే ఈ అనుమానం నిజమవక మానదు. ఇన్స్టా స్టోరీస్ లో ఊర్వశి తాజాగా  ఓ వీడియో పోస్ట్ చేసింది. అందులో నసీమ్ షా.. ఊర్వశిని కన్నార్పకుండా చూస్తున్నట్టు.. అది చూసి ఊర్వశి సిగ్గు పడుతున్నట్టుగా ఉంది.  

ఆసియా కప్ - 2022లో భాగంగా  భారత్-పాకిస్తాన్ మధ్య జరిగిన రెండు మ్యాచుల్లోనూ ఊర్వశి దర్శనమిచ్చింది. అయితే ఆమె వచ్చింది రిషభ్ పంత్ కోసమని అందరూ భావించారు.  కెమెరామెన్లు కూడా పంత్-ఊర్వశిల చూపులను  క్యాప్చర్ చేసి అభిమానులకు ఫన్ ను పంచారు. కానీ  పాకిస్తాన్ తో తొలి మ్యాచ్ లో పంత్ ఆడలేదు. రెండో మ్యాచ్ లో ఆడినా దారుణంగా విఫలమయ్యాడు. 

అయితే ఊర్వశి వచ్చింది రిషభ్ కోసం కాదా..?  19 ఏండ్ల కుర్రాడు నసీమ్ షా కోసమా..? అని నెటిజన్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయమై సోషల్ మీడియా వేదికగా పలువురు అభిమానులు ఊర్వశిపై ప్రశ్నల వర్షం సంధించారు. నసీమ్ షా తో లవ్ లో పడ్డావా..? అని ప్రశ్నించారు. దీనికి సమాధానంగా ఊర్వశి తన ఇన్స్టా స్టోరీస్ లో ఈ వీడియోను పోస్ట్ చేసింది. అయితే ఇది ఎడిటెడ్ వీడియో అని స్పష్టంగా అర్థమవుతూనే ఉంది.   మరి ఊర్వశి కావాలనే ఈ వీడియో పోస్ట్ చేసిందా..? లేక నిజంగానే ఈ ఇద్దరి మధ్య   లవ్ ట్రాక్ మొదలైందా..?  అనేది మాత్రం ఇప్పటికైతే సస్పెన్సే..  

 

ఇదిలాఉండగా ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో ఊర్వశి.. ‘వారణాసిలో నేను ఓ మూవీ షూటింగ్‌లో పాల్గొని హోటల్ లో అలిసిపోయి పడుకున్నా. నన్ను  కలవడానికి మిస్టర్ ఆర్‌పీ నేను బస చేస్తున్న హోటల్ కు వచ్చాడు. కానీ నాకు ఆ విషయం తెలీదు. షూటింగ్‌ లో బాగా అలిసిపోయి పడుకున్నా. లేచి చూసేసరికి 17 మిస్డ్ కాల్స్ ఉన్నాయి. నేను చాలా ఫీల్ అయ్యా. వెంటనే ఫోన్ చేసి, ముంబై వచ్చాక కలుస్తానని చెప్పాను. చెప్పినట్టే ముంబైకి వచ్చినప్పుడు కలిశాను. అయితే ఆ తర్వాతే ఏం జరిగిందో తెలీదు కానీ అది అక్కడితో తెగిపోయింది. మీడియా వార్తల వల్ల కూడా మా మధ్య బంధం పెరగకుండానే చెడిపోయింది.’ అంటూ కామెంట్ చేసింది.  

 

ఈ వ్యాఖ్యలపై రిషభ్ కూడా తనదైన శైలిలో స్పందించాడు. ‘‘కొందరు పాపులారిటీ కోసం ఇంటర్వ్యూల్లో ఎందుకు ఇలా అబద్ధాలు చెబుతారో అర్థం కాదు. కేవలం వార్తల్లో నిలిచేందుకు ఇలా చేస్తారంటే ఫన్నీగా ఉంది. పేరు కోసం, ఫేమ్ కోసం ఇంతగా పాకులాడేవారిని వారిని చూస్తుంటే బాధగా ఉంటుంది... వాళ్లకి దేవుడి ఆశీస్సులు ఉండాలి... ’’ అని  కౌంటరిచ్చాడు. మళ్లీ దానికి ఊర్వశి.. ‘ఆర్‌పీ భయ్యా..  నా మీద నిందలు మోపడం ఆపి క్రికెట్ ఆడుకుంటే మంచిది’ అని  పోస్ట్ పెట్టింది. దీంతో ఈ గొడవను ఇక్కడితో ముగించాలనుకున్న పంత్..  ‘మనం నియంత్రించలేని విషయాలమీద ఎక్కువగా ఒత్తిడికి గురికావొద్దు..’ అని ఓ కొటేషన్ షేర్ చేశాడు. ఇప్పటికైతే వీళ్లిద్దరి కథ అలా సమాప్తమైంది. 

Follow Us:
Download App:
  • android
  • ios