ప్రతీకారం తీర్చుకున్న ముంబై.. 42 పరుగుల తేడాతో యూపీ చిత్తు..
WPL 2024 : మహిళల ప్రీమియర్ లీగ్‌లో డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్ నాలుగో విజయాన్ని నమోదు చేసింది. కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి యూపీ బ్యాటర్లను క్రీజ్ లో నిలువకుండా చేశారు.దీంతో ముంబై 42 పరుగుల తేడాతో యూపీ వారియర్స్‌ను చిత్తు చేసింది. బెంగళూరులో ఎదురైన పరాజయానికి గట్టిగా బదులు తీర్చుకొంది.
WPL 2024 : మహిళల ప్రీమియర్ లీగ్‌లోని 14వ మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్ 43 పరుగుల తేడాతో యూపీ వారియర్స్‌పై గెలిచి మునుపటి ఓటమికి ప్రతీకారం తీర్చుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలోని ముంబై సేన నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 160 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ కు వచ్చిన యూపీ రాణించలేకపోయింది. 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి యూపీ 118 పరుగులు మాత్రమే చేయగలిగింది.
టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ కు దిగిన ముంబై ఇండియన్స్ కు శుభారంభం దక్కలేదు. చామరి అటపట్టు బౌలింగ్ దాటికి హేలీ మాథ్యూస్ కేవలం 4 పరుగులు చేసి పెవిలియన్ బాటపట్టింది. అదే సమయంలో యాస్టికా భాటియా తొమ్మిది పరుగులు చేసిన తర్వాత ఔట్ అయ్యారు. కానీ, బ్రంట్, కెప్టెన్ హర్మన్ (33) మూడో వికెట్‌కు 59 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. బ్రంట్‌ను 35 పరుగుల వద్ద రాజేశ్వరి బౌల్డ్ చేయగా.. హర్మన్‌ను సైమా పెవిలియన్ చేర్చింది.
ఐదో నంబర్‌లో బ్యాటింగ్‌కు దిగిన అమేలియా(39) చేసి జట్టును అందకుంది. కానీ, సైమా ఠాకూర్ బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ అయ్యింది. ఆ తరువాత సజీవన్ సజ్నాతో కలిసి ఆరో వికెట్‌కు 40 పరుగులకు పైగా భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. యూపీపై సజ్నా 22 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచింది. దీంతో ముంబై స్కోరు 160 మార్క్‌ను అందుకొంది. యూపీ తరఫున చమరి అటపట్టు రెండు వికెట్లు తీయగా, రాజేశ్వరి గైక్వాడ్, దీప్తి శర్మ, సైమా ఠాకూర్‌లకు ఒక్కో వికెట్ దక్కింది.
అనంతరం 161 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బయలుదేరిన యూపీ ఆదిలో కష్టాలో పడింది. ముంబై బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో.. దీప్తి శర్మ (53 నాటౌట్) మినహా మిగతా బ్యాటర్లు ఎక్కువసేపు క్రీజులో నిలవలేక పోయారు. అలిస్సా హేలీ(3), కిరణ్ నవ్‌గిరే (7), ఆటపట్టు(3) ఫ్లాప్ అయ్యారు. కేవలం 15 పరుగులకే టాప్ ఆర్డర్ కుప్పకూలింది. ముంబైపై యూపీ తరఫున దీప్తి శర్మ అత్యధిక పరుగులు చేసింది. ఆరు ఫోర్లు, రెండు సిక్సర్ల సాయంతో 53 పరుగులు నాటౌట్‌గా నిలిచింది.
దీప్తి తప్ప ఏ బ్యాటర్ అంతగా రాణించలేకపోయారు. గ్రేస్ హారిస్ (1), శ్వేతా సెహ్రావత్ (17), సోఫీ ఎక్లెస్టోన్ ((0), ఉమా ఛెత్రి (8), సైమా ఠాకూర్ (0) స్కోరు చేశారు. ఇలా ఛేదనలో యూపీ ఓవర్లన్నీ ఆడి 118/9 స్కోరు మాత్రమే చేసింది. ముంబై బౌలర్లలో సైకా ఇషాక్ మూడు వికెట్లు తీయగా, నేట్ సివర్ బ్రంట్ రెండు వికెట్లు తీశారు. కాగా, షబ్నిమ్ ఇస్మాయిల్, హేలీ మాథ్యూస్, పూజా వస్త్రాకర్, సజీవన్ సజ్నా తలో వికెట్ తీశారు.
మార్కుల పట్టిక స్థితి
ఈ విజయంతో ముంబై కు ఎనిమిది పాయింట్లు దక్కడంతో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలిచింది. అదే సమయంలో యూపీ నాలుగు పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది. ఐదు మ్యాచ్‌ల్లో నాలుగు విజయాలతో ఢిల్లీ క్యాపిటల్స్ మొదటి స్థానంలో ఉండగా, ఆర్‌సీబీ మూడో స్థానంలో నిలిచింది. గుజరాత్ జెయింట్స్ ఒక్క విజయంతో పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో కొనసాగుతోంది.