భారత సీనియర్ పేసర్ ఉమేశ్ యాదవ్‌కి న్యూ ఇయర్ వస్తూనే శుభవార్తను మోసుకొచ్చింది. ఉమేశ్ యాదవ్ భార్య తాన్య ఓ ఆడబిడ్డకు జన్మనిచ్చింది. గాయం కారణంగా జట్టుకి దూరమైన ఉమేశ్ యాదవ్, స్వదేశానికి తిరిగి రానున్నాడు. గాయపడిన ఉమేశ్ యాదవ్ స్థానంలో యార్కర్ కింగ్ నటరాజన్‌ను జట్టులోకి తీసుకుంటున్నట్టు ప్రకటించింది బీసీసీఐ.

ఐపీఎల్ 2020 ప్రదర్శన కారణంగా మొదట టెస్టులకు నెట్ బౌలర్‌గా మాత్రమే ఎంపికైన నటరాజన్, టీ20లకు ఎంపికైన వరుణ్ చక్రవర్తి గాయం కారణంగా తప్పుకోవడంతో టీ20 జట్టులోకి వచ్చాడు. నవ్‌దీప్ సైనీ మొదటి రెండు వన్డేల్లో ఫెయిల్ కావడంతో టీ20ల కంటే ముందే వన్డేల్లోకి వచ్చిన నటరాజన్... భారత జట్టుకి అద్భుత విజయాన్ని అందించాడు.

టీ20 సిరీస్‌లో స్టార్ పర్ఫామెన్స్ ఇచ్చిన నటరాజన్, ఇప్పుడు ఉమేశ్ యాదవ్ గాయం కారణంగా టెస్టు జట్టులోకి కూడా ఎంట్రీ ఇస్తున్నాడు. ఉమేశ్ యాదవ్ స్థానంలో టెస్టు టీమ్‌కి సెలక్ట్ అయిన నటరాజన్ కూడా ఐపీఎల్ సమయంలో తండ్రి అయిన సంగతి తెలిసిందే. నటరాజన్‌కి కూడా ఆడబిడ్డ జన్మించింది.