Asianet News TeluguAsianet News Telugu

బంగ్లాదేశ్ మహిళా క్రికెటర్లకు కరోనా పాజిటివ్... జింబాబ్వే టూర్ ముగించుకుని...

ఐసీసీ వరల్డ్ కప్ క్వాలిఫైయర్స్‌లో పాల్గొనేందుకు జింబాబ్వే వెళ్లిన బంగ్లా వుమెన్స్ టీమ్... స్వదేశానికి తిరిగి వచ్చిన తర్వాత ఇద్దరు ప్లేయర్లకు పాజిటివ్...

Two Bangladesh Women Cricketers tested positive after return from Zimbabwe
Author
India, First Published Dec 7, 2021, 12:16 PM IST

బంగ్లాదేశ్ మహిళా క్రికెట్ టీమ్‌లో ఇద్దరు ప్లేయర్లకు కరోనా పాజిటివ్‌గా వచ్చింది. జింబాబ్వే టూర్ ముగించుకుని స్వదేశానికి తిరిగి వచ్చిన బంగ్లా వుమెన్స్ టీమ్, ప్రస్తుతం క్వారంటైన్‌లో గడుపుతోంది. జింబాబ్వేలో వుమన్స్ వరల్డ్ కప్ క్వాలిఫైయర్స్‌లో పాల్గొనడానికి వెళ్లింది బంగ్లాదేశ్ మహిళా జట్టు. అయితే కరోనా ఒమిక్రాన్ వేరియెంట్ కేసుల కారణంగా వుమన్స్ వరల్డ్ కప్ టోర్నీ క్వాలిఫైయర్స్‌ను అర్ధాంతరంగా రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ). ఐసీసీ ర్యాంకింగ్స్ ఆధారంగా ప్రపంచ కప్‌కి టీమ్స్ అర్హత సాధిస్తాయని తెలిపింది...

Read: ఒకే ఫ్రేమ్‌లో యువరాజ్ సింగ్, ఎమ్మెస్ ధోనీ... చాలా ఏళ్ల తర్వాత పాత మిత్రులను కలిపిన కబడ్డీ...ఒకే ఫ్రేమ్‌లో యువరాజ్ సింగ్, ఎమ్మెస్ ధోనీ...  

ఐసీసీ వరల్డ్ కప్ క్వాలిఫైయర్స్‌ను రద్దు చేస్తున్నట్టు ప్రకటించిన వెంటనే డిసెంబర్ 1న తిరిగి ఢాకాకి చేరకుంది బంగ్లా వుమెన్స్ క్రికెట్ జట్టు. ఆఫ్రికా దేశాల్లో కరోనా కేసులు పెరుగుతున్న కారణంగా ఐదు రోజుల పాటు తప్పనిసరి క్వారంటైన్‌లో పాల్గొనాలని ప్లేయర్లను కోరింది. 

డిసెంబర్ 6 వరకూ నిర్వహించిన పరీక్షల్లో బంగ్లా వుమెన్స్ టీమ్ ప్లేయర్లందరికీ నెగిటివ్ రిజల్ట్ కాగా, ఆఖరి రోజు నిర్వహించిన పరీక్షల్లో ఇద్దరు ప్లేయర్లు కరోనా పాజిటివ్‌గా తేలారు. వెంటనే వారిని ఐసోలేషన్‌కి తరలించిన బంగ్లా క్రికెట్ బోర్డు, వారితో పాటు మిగిలిన ప్లేయర్లను కూడా మరో రెండు రోజులు క్వారంటైన్‌లో గడపాల్సిందిగా సూచించింది...

ఐసీసీ ర్యాంకింగ్స్‌లో మిగిలిన దేశాల కంటే మెరుగైన స్థానాల్లో ఉన్న బంగ్లాదేశ్, పాకిస్తాన్, వెస్టిండీస్, శ్రీలంక, ఐర్లాండ్ జట్లు నేరుగా ఐసీసీ మహిళా వరల్డ్ కప్‌కి అర్హత సాధించాయి. జింబాబ్వేలో జరగాల్సిన క్వాలిఫైయర్స్, ఒమిక్రాన్ వేరియెంట్ కారణంగా రద్దయినా న్యూజిలాండ్‌లో వచ్చే ఏడాది మరో రౌండ్‌ క్వాలిఫైయర్స్ జరగనున్నాయి.

ఇందులో ఆస్ట్రేలియాతో పాటు ఇంగ్లాండ్, ఇండియా, సౌతాఫ్రికా, న్యూజిలాండ్ జట్లు పోటీీపడతాయి. 2022 నుంచి 2025 వరకూ జరిగే ఐసీసీ వుమెన్స్ ఛాంపియన్‌షిప్స్‌ను 8 జట్ల నుంచి 10 జట్లకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది ఐసీసీ.

ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, ఇండియా, సౌతాఫ్రికా, న్యూజిలాండ్, పాకిస్తాన్, వెస్టిండీస్, బంగ్లాదేశ్, శ్రీలంక, ఐర్లాండ్ జట్లు ఈ టోర్నీలో పాల్గొనబోతున్నాయి..

ఐసీసీ వరల్డ్ కప్ క్వాలిఫైయర్స్‌లో పాల్గొనేందుకు థాయ్‌లాండ్‌‌తో పాటు యూఏఈ, నెదర్లాండ్స్, ఐర్లాండ్, శ్రీలంక, వెస్టిండీస్, పాకిస్తాన్ మహిళా జట్టు జింబాబ్వేకి వెళ్లాయి. అయితే పాకిస్తాన్, జింబాబ్వే జట్ల మధ్య మ్యాచ్ తర్వాత ఈ క్వాలిఫైయర్స్‌ను అర్ధాంతరంగా రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది అంతర్జాతీయ క్రికెట్ మండలి...

Read Also: అజింకా రహానేకి కాదు, అతనికి బ్రేక్ కావాలి... బెన్ స్టోక్స్‌లా విరాట్ కోహ్లీ కూడా... 

మెరుగైన ర్యాంకు ఉన్న కారణంగా బంగ్లాదేశ్, పాకిస్తాన్ జట్లు నేరుగా అర్హత సాధించగా, క్వాలిఫైయర్స్‌లో 4 మ్యాచులు ఆడి 3 విజయాలు అందుకున్న థాయిలాండ్, ఐసీసీ ర్యాంకింగ్స్‌లో దిగువన ఉన్న కారణంగా వరల్డ్ కప్ టోర్నీకి అర్హత సాధించలేకపోయింది. అయితే జింబాబ్వే, యూఏఈ జట్లు కూడా నిరాశగా వెనుదిరగాల్సి వచ్చింది. 

Follow Us:
Download App:
  • android
  • ios