IPL 2021: ముంబయి ఇండియన్స్ (mumbai indians) తో ఆదివారం రాత్రి జరిగిన హై ఓల్టేజీ మ్యాచ్ లో హ్యాట్రిక్ (hattrick) వికెట్లు తీసి ఆ జట్టు ఓటమికి కారణమైన రాయల్ ఛాలెంజర్స్ (royal challengers banglore) బౌలర్ హర్షల్ పటేల్ పై  ప్రశంసల వర్షం కురుస్తున్నది. 

సంచలన స్పెల్ తో ముంబయి ఇన్నింగ్స్ నడ్డి విరిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బౌలర్ హర్షల్ పటేల్ పై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సీజన్ లో అత్యధిక వికెట్లు (23) తీసిన బౌలర్ గా ప్రస్తుతం పర్పుల్ క్యాప్ (purplr cap) హోల్డర్ దక్కించుకున్న హర్షల్.. ఇక టీమ్ ఇండియాలోకి రావడం లాంఛనమే అని అభిమానులు చెప్పుకుంటున్నారు. ముంబయితో మ్యాచ్ లో 17వ ఓవర్ లో వరుస బంతుల్లో విధ్వంసకర హార్దిక్ పాండ్యా, కీరన్ పొలార్డ్, రాహుల్ చాహర్ లను పెవిలియన్ పంపిన ఈ హర్యానా యువ సంచలనం.. ఆర్సీబీ తరఫున హ్యాట్రిక్ సాధించిన మూడో బౌలర్ గా నిలిచాడు.

గతంలో సామూల్ బద్రి, ప్రవీణ్ కుమార్ లు ఈ ఘనత సాధించారు. ఇక ఐపీఎల్ లో హ్యాట్రిక్ వికెట్లు తీసిన వారి జాబితాలో హర్షల్ 17వ బౌలర్ కావడం గమనార్హం. ఇదిలాఉండగా కీలక సమయంలో వికెట్లు పడగొట్టిన హర్షల్ పై టీమ్ ఇండియా మాజీ బౌలర్లు ట్విట్టర్ వేదికగా ప్రశంసలు కురిపించారు. భారత మాజీ పేసర్ ఆర్పీ సింగ్ స్పందిస్తూ.. ‘భారత జట్టులోకి రావడానికి స్వాగతం’ అని ట్వీట్ చేశాడు.

Scroll to load tweet…


టర్బోనేటర్ హర్బజన్ సింగ్, చెన్నై సూపర్ కింగ్స్ బ్యాట్స్మెన్ ఎస్. బద్రీనాథ్, భారత మాజీ ఆఫ్ స్పిన్నర్ ప్రగ్యాన్ ఓజా లు కూడా పటేల్ బౌలింగ్ కు ఫిదా అయ్యారు. 

Scroll to load tweet…

Scroll to load tweet…

ఆర్సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లి కూడా హర్షల్ ప్రదర్శనపై హర్షం వ్యక్తం చేశాడు.