టీమిండియా ఆల్‌రౌండర్లు హార్ధిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా తండ్రి హిమాన్షు పాండ్యా మరణించి 8 రోజులు కావస్తోంది. ఈ నెల 16న గుండెపోటుతో ప్రాణాలు విడిచారు హిమాన్షు పాండ్యా. పాండ్యా బ్రదర్స్ ఈ షాక్ నుంచి ఇంకా బయటికి రాలేదు. కొన్ని రోజుల క్రితం కృనాల్ పాండ్యా, తండ్రిను గుర్తుచేసుకుంటూ ఎమోషనల్ మెసేజ్ పెట్టగా... తాజాగా హార్ధిక్ పాండ్యా తండ్రికి నివాళి ఘటించాడు.

తండ్రితో గడిపిన ఆహ్లాదభరితమైన క్షణాలను పోస్టు చేసిన హార్ధిక్ పాండ్యా... ‘టు డాడ్’ అంటూ కామెంట్ చేశాడు. పాండ్యా బ్రదర్స్‌ను అమితాబ్ బచ్చన్ పొడుగుతున్న దృశ్యాలను ఇందులో జత చేశాడు. ఈ వీడియోకి ముంబై ఇండియన్స్ ప్లేయర్ కిరన్ పోలార్డ్,  సూర్యకుమార్ యాదవ్, నితీశ్ రాణా,ఇషాన్ కిషన్, హార్ధిక్ పాండ్యా భార్య నటాశా హార్ట్ సింబల్స్‌తో కామెంట్ చేశారు... 

తండ్రి చనిపోయిన తర్వాత ‘నాన్న ఎప్పటికీ నువ్వే నా హీరో... నిన్ను కోల్పోవడం నా జీవితంలో చాలా పెద్ద లోటు..కానీ నువ్వు నాకు జీవితంలో మరిచిపోలేని మధుర స్మృతులెన్నో మిగిల్చావంటూ’ సుదీర్ఘమైన పోస్టు రాశాడు హార్ధిక్ పాండ్యా...