టీఎన్‌పీఎల్ చెపాక్ సూపర్ గిల్లీస్ తరుపున ఆడుతున్న ఎన్ జగదీశన్‌ని మన్కడింగ్ ద్వారా రనౌట్ చేసిన బాబా అపరాజిత్.. సీనియర్‌కి మిడిల్ ఫింగర్ చూపించిన సీఎస్‌కే బ్యాటర్... 

ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తరుపున ఆడే ఎన్ జగదీశన్, తమిళనాడు ప్రీమియర్ లీగ్‌ (టీఎన్‌పీఎల్- 2022) సీజన్‌లో తన అసభ్య ప్రవర్తనతో వార్తల్లో నిలిచాడు. ఎన్ జగదీశన్, టీఎన్‌పీఎల్ చెపాక్ సూపర్ గిల్లీస్ తరుపున ఆడుతున్నాడు. నెల్లాయ్ రాయల్ కింగ్స్‌‌తో జరిగిన మ్యాచ్‌లో నారాయణ్ జగదీశన్, మన్కడింగ్ విధానం ద్వారా రనౌట్ అయ్యాడు. తనను మన్కడింగ్ చేసిన సీనియర్ బౌలర్ బాబా అపరాజిత్‌ వైపు మిడిల్ ఫింగర్ చూపించడం తీవ్ర వివాదాస్పదమైంది...

తొలుత బ్యాటింగ్ చేసిన నెల్లాయ్ రాయల్ కింగ్స్, నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 184 పరుగులు చేసింది. లక్ష్మేశ సూర్యప్రకాశ్ 50 బంతుల్లో 8 ఫోర్లతో 62 పరుగులు చేయగా బాబా అపరాజిత్ 2, బాబా ఇంద్రజిత్ 3 పరుగులు చేసి అవుట్ అయ్యారు. సంజయ్ యాదవ్ 47 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్సర్లతో 87 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు...

లక్ష్యఛేదనలో మొదటి వికెట్‌కి 3.3 ఓవర్లలో 35 పరుగులు జోడించారు ఎన్ జగదీశన్, కౌషిక్ గాంధీ. 15 బంతుల్లో 4 ఫోర్లతో 25 పరుగులు చేసిన ఎన్‌ జగదీశన్, అపరాజిత్ బౌలింగ్ సమయంలో బంతి వేయకముందే క్రీజు దాటి ముందుకు వచ్చాడు. దాన్ని గమనించిన అపరాజిత్, వెంటనే బెయిల్స్‌ని గిరాటేశాడు. దీంతో అంపైర్, ఎన్ జగదీశన్‌ని రనౌట్‌గా ప్రకటించాడు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన ఎన్ జగదీశన్, పెవిలియన్‌కి వెళ్లే సమయంలో అపరాజిత్‌కి మిడిల్ ఫింగర్ చూపించాడు...

గ్లవ్స్ ఉన్నప్పుడు మిడిల్ ఫింగర్ చూపిస్తూ సైగలు చేసిన జగదీశన్, ఆ తర్వాత గ్లవ్స్ తీసి కూడా మళ్లీ మళ్లీ చూపిస్తూ పెవిలియన్ చేరాడు. ఈ సంఘటన మొత్తం ప్రత్యేక్ష ప్రసారం కావడంతో సీనియర్ ప్లేయర్‌కి మధ్య వేలు చూపించిన జగదీశన్‌పై తీవ్రమైన ట్రోలింగ్ వచ్చింది... 

టాలెంట్ ఎంతున్నా సీనియర్లతో ఎలా నడుచుకోవాలో కూడా తెలియకపోతే వృథాయే అంటున్నారు నెటిజన్లు. దీంతో తప్పు తెలుసుకున్న ఎన్ జగదీశన్, సోషల్ మీడియా ద్వారా క్షమాపణలు తెలిపాడు. ‘క్రికెట్ అంటే నాకు ప్రాణం. క్రీడాస్ఫూర్తితో మెలగాలనే విషయం కూడా తెలుసు. అయితే ఒక్క క్షణం నాపై నేను కంట్రోల్ కోల్పోయాను. నేను చేసిన దానికి క్రికెట్ లవర్స్ అందరికీ క్షమాపణలు కోరుతున్నా...’ అంటూ రాసుకొచ్చాడు జగదీశన్...

Scroll to load tweet…

 జగదీశన్ త్వరగా అవుటైన కౌషిక్ గాంధీ 42 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లతో 64 పరుగులు, సోనూ యాదవ్ 23 బంతుల్లో 3 సిక్సర్లతో 34 పరుగులు, హరీశ్ కుమార్ 12 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 26 పరుగులు చేయడంతో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి సరిగ్గా 184 పరుగులు చేసింది చెపాక్ సూపర్ గిల్లీస్...

మ్యాచ్ టైగా ముగియడంతో సూపర్ ఓవర్‌లో నెల్లాయ్ రాయల్ కింగ్స్ వికెట్ నష్టానికి 9 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని 5 బంతుల్లో ఓ వికెట్ కోల్పోయి ఛేదించిన చెపాక్ ‘సూపర్’ విక్టరీ సాధించింది.