టీమిండియాలో రవీంద్ర జడేజా ఎంత మంచి ఫీల్డర్ అనేది ప్రత్యేకంగా చెప్కక్కర్లేదు. తన మెరుపు ఫీల్డింగ్‌తో భారత విజయాల్లో జడ్డూ కీలక పాత్ర పోషించిన ఉదంతాలు ఎన్నో ఉన్నాయి.

ఒంటిచేత్తో క్యాచ్‌లు అందుకోవడంతో పాటు ఫీల్డింగ్‌తో తన మెరుపు విన్యాసాలతో ప్రత్యర్ధి జట్టుకు పరుగులు రాకుండా అడ్డుకున్నాడు. టీమిండియా ఆటగాడు కాబట్టి.. మనవాళ్లు ప్రశంసించడంలో అద్భుతం ఏమి లేదు.

కానీ జడేజా ఫీల్డింగ్‌ను గుర్తుచేసుకుంటూ న్యూజిలాండ్ జట్టు ఓ క్యాచ్ పట్టుకునే ఫోటోను ట్విట్టర్‌లో షేర్ చేసింది. గురువారం త్రో బ్యాక్ థర్స్‌డే హ్యాష్‌ట్యాగ్ పేరిట షేర్ చేసిన ఆ ఫోటోలో డీప్‌ స్క్వేర్‌ లెగ్‌లో నిల్చున్న జడేజా వెనక్కి తిరిగి ఒంటిచేత్తో అందుకున్న ఓ స్టన్నింగ్‌ క్యాచ్ అందుకున్నాడు.

ఇది ప్రపంచ చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతుందని కివీస్ కొనియాడింది. గత ఏడాది జనవరిలో భారత జట్టు 5 టీ20, మూడు వన్డేలు, రెండు టెస్టులు ఆడేందుకు న్యూజిలాండ్‌లో పర్యటించింది.

ఈ టూర్ సందర్భంగా చివరి టెస్టు మ్యాచ్‌లో జడేజా ఈ క్యాచ్ అందుకున్నాడు. ఆ మ్యాచ్‌లో మహ్మద్ షమీ వేసిన బంతిని కివీస్ బ్యాట్స్‌మన్ నీల్ వాగ్నర్ ఒక భారీ షాట్ ఆడాడు. ఆటగాళ్లతో పాటు ప్రేక్షకులు సైతం దానిని ఫోర్‌గానే భావించారు.

కానీ ఇక్కడే అద్భుతం చోటు చేసుకుంది. డీప్ స్క్వేర్‌ లెగ్‌లో నిల్చున్న జడేజా పైకి ఎగిరి ఒంటిచేత్తో స్టన్నింగ్ క్యాచ్ అందుకున్నాడు. ఆ ఫీట్‌తో మిగతా ఆటగాళ్లు సైతం షాక్‌కు గురయ్యారు.