India vs Australia: మ్యాట్ కుహ్నేమన్ ఎంట్రీతో స్వదేశానికి పయనమైన ఆస్ట్రేలియా సీనియర్ స్పిన్నర్ అస్టన్ అగర్.. మూడో టెస్టులో బరిలో దిగనున్న మిచెల్ స్వీప్సన్!..
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2023 టోర్నీలో ఆస్ట్రేలియాకి ఏదీ కలిసి రావడం లేదు. తొలి రెండు టెస్టుల్లో చిత్తుగా ఓడిన ఆస్ట్రేలియా... ఇప్పటికే 2-0 తేడాతో వెనకబడి, టెస్టు సిరీస్ గెలవాలనే కోరికను నెరవేర్చుకోలేకపోయింది. ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ జోష్ హజల్‌వుడ్‌తో పాటు ఓపెనర్ డేవిడ్ వార్నర్ గాయాలతో సిరీస్ మధ్యలో నుంచి తప్పుకున్నారు. డేవిడ్ వార్నర్ రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేస్తూ గాయపడగా... జోష్ హజల్‌వుడ్ ఒక్క మ్యాచ్ కూడ ఆడకుండానే స్వదేశానికి పయనం అయ్యాడు..
తాజాగా ఆస్ట్రేలియా లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ అస్టన్ అగర్ కూడా స్వదేశానికి పయనం కాబోతున్నాడు. తొలి రెండు టెస్టుల్లో తుది జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు అస్టన్ అగర్. ఢిల్లీ టెస్టులో టాడ్ ముర్ఫీని అంతర్జాతీయ టెస్టు ఆరంగ్రేటం చేయించిన ఆస్ట్రేలియా, రెండో టెస్టులో మ్యాట్ కుహ్నేమన్‌ని తుది జట్టులోకి తీసుకొచ్చింది..
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి తొలుత ప్రకటించిన నలుగురు స్పిన్నర్లలో అస్టన్ అగర్ ఒకడు. సీనియర్ స్పిన్నర్లు నాథన్ లియాన్, మిచెల్ స్వీప్సన్‌తో పాటు టాడ్ ముర్ఫీ, అస్టన్ అగర్‌లను ఇండియాలో టెస్టు సిరీస్‌కి ఎంపిక చేసింది క్రికెట్ ఆస్ట్రేలియా. అయితే వ్యక్తిగత కారణాలతో సీనియర్ స్పిన్నర్ మిచెల్ స్వీప్సన్ స్వదేశానికి వెళ్లాడు...
దీంతో అతని స్థానంలో తొలుత ప్రకటించిన 18 మంది జట్టులో లేని మ్యాట్ కుహ్నేమన్‌ని టీమ్‌లోకి తీసుకొచ్చింది. అతను రెండో టెస్టులో బాగా బౌలింగ్ చేయడంతో అస్టన్ అగర్, స్వదేశానికి వెళ్లి దేశవాళీ టోర్నీల్లో పాల్గొనబోతున్నాడు...
‘అస్టన్ అగర్‌ని స్వదేశానికి పంపిస్తున్నారని విన్నాను. ఇప్పటికే టీమ్‌లో నలుగురు స్పిన్నర్లు ఉండడంతో అస్టన్ అగర్ అవసరం టీమ్‌కి లేదని, అతన్ని స్వదేశానికి పంపిస్తున్నారు. అస్టన్ అగర్ బౌలింగ్ గురించి భారత బ్యాటర్లకు తెలుసు. అతని బౌలింగ్‌లో భారత బ్యాట్స్‌మెన్ ఇంతకుముందు బ్యాటింగ్ చేశారు...
అయితే ఇది అతనికి చాలా పెద్ద అవమానం. టీమ్‌కి ఎంపిక చేసిన తర్వాత మధ్యలో అవసరం లేదని వెనక్కి పంపడం కరెక్ట్ కాదు. ఇది ప్లేయర్లపై అనవసర ఒత్తిడిని పెంచుతుంది. ప్రతీ ప్లేయర్ కూడా అవకాశం వచ్చినప్పుడు నూటికి నూరు శాతం ఇవ్వాలనే చూస్తాడు. ఇలా టీమ్‌కి సెలక్ట్ చేసి, అవసరం లేదని పక్కనబెడితే.. అది వారికి తీవ్ర అవమానమే..
నెట్స్‌లో మ్యాట్ కుహ్నేమన్ బాగా బౌలింగ్ చేశాడని, అతను ప్రాక్టీసె సెషన్స్‌లో నాలుగు రోజుల పాటు బౌలింగ్ చేయకపోయినా టీమ్‌లోకి తీసుకొచ్చారు. అయితే నా వరకూ టీమ్‌కి ఎంపిక చేసిన ప్లేయర్లకు మొదటి ప్రాధాన్యం ఇచ్చిన తర్వాతే మిగిలిన ప్లేయర్లను వాడాలి...’ అంటూ చెప్పుకొచ్చాడు ఆస్ట్రేలియా మాజీ వికెట్ కీపర్ ఆడమ్ గిల్‌క్రిస్ట్...
అస్టన్ అగర్‌తో పాటు ఆస్ట్రేలియా టెస్టు కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ కూడా వ్యక్తిగత కారణాలతో స్వదేశానికి వెళ్లాడు. రెండో టెస్టు మూడు రోజుల్లోనే ముగియడంతో స్వదేశానికి వెళ్లిన ప్యాట్ కమ్మిన్స్, మార్చి 1న ఇండోర్‌లో ప్రారంభమయ్యే మూడో టెస్టు సమయానికి తిరిగి ఇండియాకి రాబోతున్నాడు.
