Asianet News TeluguAsianet News Telugu

ప్రేమ‌లో మునిగి.. పెళ్లి కాకుండానే తండ్రులైన స్టార్ క్రికెట‌ర్లు వీరు

father before marriage : ప్రేమలో పడి పెళ్లికి ముందే తండ్రులైన స్టార్ క్రికెట‌ర్లు చాలా మందే ఉన్నారు. ఈ జాబితాలో భారత్ కు చెందిన స్టార్ క్రికెటర్ హార్దిక్ పాండ్యా కూడా ఉన్నాడు. ఈ జాబితాలోని టాప్-6 స్టార్ క్రికెటర్ల వివరాలు ఇలా ఉన్నాయి.  

These legendary cricketers have become fathers without marriage, fans will be surprised to see the name in the list RMA
Author
First Published Aug 22, 2024, 11:20 AM IST | Last Updated Aug 22, 2024, 11:20 AM IST

1. హార్దిక్ పాండ్యా

పెళ్లికి ముందే తండ్రి అయిన భారతీయ స్టార్ క్రికెటర్ హార్దిక్ పాండ్యా. హార్దిక్ పాండ్యా సెర్బియా నటి నటాసా స్టాంకోవిచ్‌తో 2020 జనవరి 1న దుబాయ్‌లో నిశ్చితార్థం చేసుకున్నారు. జూలై 30, 2020న హార్దిక్ పాండ్యా తన న‌టాషా గర్భవతి అనీ, తాను తండ్రి కాబోతున్నాన‌ని వెల్లడించాడు. హార్దిక్ పాండ్యా తన బిడ్డకు 'అగస్త్య' అని పేరు పెట్టారు. త‌ర్వాత వీరు వివాహం చేసుకున్న ఇది ఎక్కువ కాలం నిల‌వ‌లేదు. హార్దిక్ పాండ్యా-నటాషా స్టాంకోవిచ్ లు ఇటీవ‌లే విడాకులు తీసుకున్నారు. 

2. జో రూట్

పెళ్లి చేసుకోకుండానే తండ్రి మ‌రో క్రికెట‌ర్ జోరూట్. ఇంగ్లాండ్ కు చెందిన ఈ స్టార్ ప్లేయ‌ర్ తన స్నేహితురాలు క్యారీ కోర్టెల్‌తో 2014 నుండి డేటింగ్ చేస్తున్నాడు. వారిద్దరూ మార్చి 2016లో టీ20 ప్రపంచ కప్ కు ముందు నిశ్చితార్థం చేసుకున్నారు. జో రూట్ వివాహం చేసుకోక‌ముందే తండ్రి అయ్యాడు. జో రూట్ కుమారుడు ఆల్ఫ్రెడ్ 7 జనవరి 2017న జన్మించాడు. ఆ తర్వాత ఈ జంట పెళ్లి చేసుకుంది. 

3. డేవిడ్ వార్నర్

ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ కూడా పెళ్లి చేసుకోకుండానే తండ్రి అయ్యాడు. 2014లో డేవిడ్ వార్నర్ గర్ల్ ఫ్రెండ్ క్యాండీస్ తన మొదటి కుమార్తెకు జన్మనిచ్చింది. డేవిడ్ వార్నర్ 2015లో క్యాండీస్‌ను వివాహం చేసుకున్నాడు. వార్నర్‌కు ఐవీ, ఇండి, ఇస్లా అనే ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.

4. డ్వేన్ బ్రావో

వెస్టిండీస్ మాజీ స్టార్ క్రికెటర్ డ్వేన్ బ్రావో కూడా పెళ్లికి ముందే తండ్రి అయ్యాడు. డ్వేన్ బ్రేవో తన ఇద్దరు స్నేహితురాలైన ఖైతా గోన్సాల్వేస్, రెజీనా రామ్‌జీత్‌లకు ముగ్గురు పిల్లలు ఉన్నారు.

5.క్రిస్ గేల్

పెళ్లి కాకుండానే తండ్రయిన క్రికెట‌ర్ల‌ల‌లో యూనివ‌ర్స‌ల్ బాస్ క్రిస్ గేల్ కూడా ఉన్నాడు. 2017లో ఐపీఎల్ జరుగుతున్నప్పుడు గేల్ ప్రేయ‌సి నటాషా బారిడ్జ్ ఒక కుమార్తెకు జన్మనిచ్చింది. 

6. ఆండ్రూ సైమండ్స్

ఆస్ట్రేలియా దిగ్గజ ఆల్‌రౌండర్ ఆండ్రూ సైమండ్స్ కూడా పెళ్లికి ముందే తండ్రి అయ్యాడు. సైమండ్స్-అతని భార్య లారా 2014 లో వివాహం చేసుకున్నారు. కొడుకు పుట్టిన ఏడాది తర్వాత ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. అతని భార్య లారాతో పాటు, అతనికి క్లో, బిల్లీ అనే ఇద్దరు సంతానం ఉన్నారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios