పింక్ బాల్ టెస్టు మ్యాచులో టీమిండియా ఘోర పరాజయానికి సోషల్ మీడియాలో ట్రోల్స్ పేలుతున్నాయి. అవకాశం దొరికినప్పుడల్లా తన హాస్యచతురత చూపించే భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్... మరోసారి తన టైమింగ్‌ చూపించాడు.

19 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన దశలో మొదటి ట్వీట్ చేసిన వీరేంద్ర సెహ్వాగ్... మరీ ఇంతలా సరేండర్ అవ్వాలా? అంటూ ఫన్నీ ఎక్స్‌ప్రెషన్‌తో ఉన్న ఫోటోను పోస్టు చేశాడు...

‘19/6... భారత టెస్టు క్రికెట్ చరిత్రలోనే అతి త్వరగా 6 వికెట్లు కోల్పోవడం... సరేండర్ ఇచ్చేయండి యార్... అయితే కొంచెమైనా పోరాటం చూపించాలి కదా... ఎవరికి తెలుసు.. ఏదైనా అద్భుతం జరగుతుందేమో’ అంటూ ట్వీట్ చేశాడు.

త్వరగా 6 వికెట్లు కోల్పోయినా భారత జట్టు కనీసం 120+ స్కోరు చేస్తుందని భావించి, వీరూ ఈ ట్వీట్ చేశాడు. అయితే 36 పరుగులకే 9 వికెట్లు కోల్పోయి ఇన్నింగ్స్ ముగించిన తర్వాత భారత బ్యాట్స్‌మెన్ పరుగులను తెలుపుతూ... ‘49204084041 మనం మరిచిపోవాల్సిన OTP...’ అంటూ ట్వీట్ చేశాడు వీరూ. ఈ ట్వీట్‌కి బీభత్సమైన స్పందన వచ్చింది.