Ashes Live: అభిమానానికి హద్దులేమీ లేవన్నది మనందరికీ తెలిసిందే. ఒక వ్యక్తిని అభిమానిస్తే వారికోసం ఏం చేయడానికైనా సిద్ధపడే అభిమానులు ఉంటారు. కానీ ఈ అభిమాని మాత్రం... 

ఆస్ట్రేలియా-ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న Ashes సిరీస్ లో ఆటకంటే ఆటేతర విషయాలు ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్నాయి. తొలి టెస్టులో భాగంగా ఓ నాలుగేండ్ల ప్రేమ జంట ఒక్కటై వార్తల్లో నిలిచింది. ఆ తర్వాత England అభిమానుల బర్మీ ఆర్మీ చేష్టలు, Australia ప్రేక్షకులు ఇంగ్లాండ్ ఆటగాళ్లను టార్గెట్ చేస్తూ సృష్టించిన అల్లరి అంతా ఇంతా కాదు. ఇక మనం ఇప్పుడు చెప్పుకోబోయేది అంతకుమించే ఉంటుంది. అభిమానానికి హద్దులేమీ లేవన్నది మనందరికీ తెలిసిందే. ఒక వ్యక్తిని అభిమానిస్తే అతడు/ఆమె కోసం ఏం చేయడానికైనా సిద్ధపడే అభిమానులు ఉంటారు. 

ఇక ఆటోగ్రాఫ్ బ్యాచ్ అయితే కేవలం పుస్తకాలల్లోనే కాదు.. వారి ఒంటి మీద ఎక్కడెక్కడో తమ అభిమాన తారలు ఇచ్చిన ఆటోగ్రాఫ్ ను అదేదో శిలలపై శిల్పి చెక్కిన శిల్పాల్లాగా దాచుకుని మురిసిపోతారు. తాజాగా ఓ ఇంగ్లాండ్ అభిమాని తన బట్టతల (bold head) మీద ఆటోగ్రాఫ్ తీసుకున్నాడు. ఇంతకూ అతడికి ఆటోగ్రాఫ్ ఇచ్చింది ఎవరనేగా మీ అనుమానం.. ఇంకెవరు..? ఇంగ్లాండ్ స్పిన్నర్ జాక్ లీచ్ (Jack Leach). 

Scroll to load tweet…

సిడ్నీలో జరుగుతున్న నాలుగో టెస్టు తొలి రోజు ఈ ఫన్నీ ఇన్సిడెంట్ చోటు చేసుకుంది. బౌండరీ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న జాక్ లీచ్ ను అక్కడ ఉన్న ఓ అభిమాని ఆటోగ్రాఫ్ అడిగాడు. తన బట్టతల మీద సంతకం చేయాలని కోరాడు. దీంతో ఓ మార్కర్ అందుకున్న లీచ్.. సదరు అభిమాని బోడిగుండు మీద సంతకం చేశాడు. అంతే.. అతడి ఆనందానికి అవధుల్లేవు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట Viralగా మారింది. 

కాగా.. తొలి టెస్టు సందర్భంగా ఓ ఆస్ట్రేలియా అమ్మాయి, ఇంగ్లాండ్ అబ్బాయి ఒక్కటయ్యారు. ఇంగ్లాండ్ కు చెందిన రాబ్ హేల్.. నాలుగేండ్ల క్రితం అంటే సరిగ్గా 2017 లో ఇదే యాషెస్ సిరీస్ లో భాగంగా ఇంగ్లాండ్ జట్టు ఆస్ట్రేలియాకు వెళ్లినప్పుడు మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ లో నటాలీ ని చూశాడు. తొలి చూపులోనే మనోడు క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఇంకేముంది. అప్పట్నుంచి నాలుగేండ్ల పాటు ఆమెను తన వైపునకు తిప్పుకోవడానికి పడరాని పాట్లు పడ్డాడు. ఇక ఏదైతే అదవుతుందని బ్రిస్బేన్ లో జరుగుతున్న తొలి టెస్టు మూడో రోజు ఆమెకు ప్రపోజ్ చేశాడు. ‘నా ప్రేమను అంగీకరిస్తావా..?’ అంటూ అందరి ముందు చెప్పేశాడు. దీనికి నటాలీ కూడా ఓకే చెప్పడంతో మనోడి లవ్ స్టోరీకి ఎండ్ కార్డు పడింది.

Scroll to load tweet…

ఇదిలాఉండగా.. సిడ్నీ టెస్టులో తొలి టెస్టులో ఆస్ట్రేలియా 416 పరుగుల వద్ద తొలి ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేసింది. రెండేండ్ల తర్వాత తుది జట్టులోకి వచ్చిన ఉస్మాన్ ఖవాజా.. సెంచరీ (137) తో ఆకట్టుకున్నాడు. స్టువర్ట్ బ్రాడ్ ఐదు వికెట్లు పడగొట్టాడు. మరోవైపు రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్.. వికెట్ నష్టపోకుండా 13 పరుగులు చేసింది.