Asianet News TeluguAsianet News Telugu

అబ్బే.. నేను సారీ చెప్పింది రిషభ్ పంత్‌కు కాదు.. నా ఫ్యాన్స్‌కు..! మళ్లీ మాట మార్చిన ఊర్వశి

Urvashi Rautela: సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోతో ఇక ఊర్వశి-పంత్ మధ్య విభేదాలు సమసిపోయినట్టేనని  భావించారు. కానీ  బాలీవుడ్ బ్యూటీ ఈ   మంటలు చల్లార్చేట్టు లేదు.  తాజాగా ఆమె.. 

That Sorry was For My Fans and loved Ones: Urvashi Rautela issues clarification
Author
First Published Sep 14, 2022, 4:06 PM IST

బాలీవుడ్ హాట్ బ్యూటీ ఊర్వశి రౌతేలా మళ్లీ మాట మార్చింది. గతంలో టీమిండియా వికెట్ కీపర్ రిషభ్ పంత్ (ఆర్పీ) ను ఉద్దేశిస్తూ ఆమె చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన విషయం తెలిసిందే. అయితే ఇటీవలే ఆమె ఓ బాలీవుడ్ వెబ్ సైట్ కు బైట్ ఇస్తూ.. ఆర్పీకి సారీ చెప్పింది. కానీ ఇంతలోనే మాట మార్చింది. ఇన్స్టాంట్ బాలీవుడ్ కు ఇచ్చిన బైట్ లో రిపోర్టర్.. ‘మీరు ఆర్సీకి ఏమైనా  మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారా..?’ అని ప్రశ్నించగా.. ఊర్వశి స్పందిస్తూ.. ‘నేను  ఏం చెప్పాలనుకుంటున్నాననంటే.. అవును ఏం  చెప్దామనుకున్నా. నాకే తెలియడం లేదు. అయితే ఒక్క విషయం సారీ.. ఐయామ్ సారీ..’ అని చేతులు జోడించి క్షమాపణలు వేడుకుంటూ అక్కడ్నుంచి వెళ్లింది. 

సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ వీడియోతో ఇక ఊర్వశి-పంత్ మధ్య విభేదాలు సమసిపోయినట్టేనని  భావించారు. కానీ  బాలీవుడ్ బ్యూటీ ఈ   మంటలు చల్లార్చేట్టు లేదు.  తాజాగా ఆమె తాను సారీ చెప్పింది ఆర్పీకి కాదని..  తన ఫ్యాన్స్ కోసం చెప్పానని వెల్లడించింది. 

ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ లో  ఊర్వశి.. ‘ఈరోజుల్లో కొన్ని అధికారిక న్యూస్ ఆర్టికల్స్, సో కాల్డ్ మెమే  పేజీల (వరెస్ట్ మార్కెటర్స్ అని సంబోధించింది) అడ్మిన్లు సినిమాలు, టీవీ షో ల కంటే ఎక్కువ  డ్రామాను రచిస్తున్నారు. నేను చెప్పిన సారీ నా ఫ్యాన్స్ కోసం.. నా ప్రియమైన వారికోసం.. అంతే, అంతకుమించి ఏమీ లేదు..’ అని రాసుకొచ్చింది. అంతేగాక ఇదే స్టోరీలో  వై ది  న్యూస్ ఈజ్ నాట్ ట్రూత్, ఫాల్స్ మిస్ లీడింగ్ లైట్, గ్రేట్ స్క్రిప్ట్, ఫ్యాక్ట్స్ ఆర్నాట్  కాపీరైటెబుల్ హ్యాష్ ట్యాగ్ లను జతపరిచింది. 

 

నెలరోజుల క్రితం ఓ ఇంటర్వ్యూలో ఊర్వశి.. ‘‘వారణాసిలో నేను ఓ మూవీ షూటింగ్‌లో పాల్గొన్నా.. అక్కడి నుంచి న్యూఢిల్లీలో ఓ షోలో పాల్గొనడానికి ఫ్లైట్ ఎక్కి వచ్చా. న్యూఢిల్లీలో రోజంతా షూటింగ్‌లో పాల్గొన్నా... మళ్లీ ఆ తర్వాతి రోజు ఫ్లైట్ పట్టుకుని, వారణాసికి వెళ్లాలి. ఆ సమయంలో నన్ను కలవడానికి అతను (మిస్టర్ ఆర్‌పీ) వచ్చాడు. నేను ఉంటున్న హోటల్‌కి వచ్చి లాబీలో వెయిట్ చేశాడు. నాకు ఆ విషయం తెలీదు. నేను 10 నిమిషాల ముందే షూటింగ్‌ నుంచి వచ్చి బాగా అలిసిపోయి పడుకున్నా...

అతను వచ్చిన విషయం కానీ, నా కోసం వెయిట్ చేస్తున్న విషయం కానీ నాకు తెలీదు.అప్పుడు నాకు ఫోన్ వచ్చింది కానీ ఆ రింగ్ కూడా నాకు వినిపించలేదు. అంతలా అలిసిపోయి మత్తుగా పడుకున్నా. లేచి చూసేసరికి 17 మిస్డ్ కాల్స్ ఉన్నాయి. నేను చాలా ఫీల్ అయ్యా.. నా కోసం అతను అంతలా వెయిట్ చేయాల్సి వచ్చిందని బాధపడ్డాను. వెంటనే ఫోన్ చేసి, ముంబై వచ్చాక కలుస్తానని చెప్పాను. చెప్పినట్టే ముంబైకి వచ్చినప్పుడు కలిశాను. అయితే ఆ తర్వాతే ఏం జరిగిందో తెలీదు కానీ అది అక్కడితో తెగిపోయింది. దానిపై మీడియా రకరకాలుగా రాసుకొచ్చింది. మీడియా వార్తల వల్ల కూడా మా మధ్య బంధం పెరగకుండానే చెడిపోయింది...’ అంటూ కామెంట్ చేసింది ఊర్వశి. 

 

ఆమె ఇంటర్వ్యూ తర్వాత  రిషభ్ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీ వేదికగా.. ‘కొందరు పాపులారిటీ కోసం ఇంటర్వ్యూల్లో ఎందుకు ఇలా అబద్ధాలు చెబుతారో అర్థం కాదు. కేవలం వార్తల్లో నిలిచేందుకు ఇలా చేస్తారంటే ఫన్నీగా ఉంది. పేరు కోసం, ఫేమ్ కోసం ఇంతగా పాకులాడేవారిని వారిని చూస్తుంటే బాధగా ఉంటుంది... వాళ్లకి దేవుడి ఆశీస్సులు ఉండాలి... ’ అంటూ ఇన్‌స్టాలో స్టోరీ పోస్టు చేశాడు.  ఆ తర్వాత ఊర్వశి.. ‘చోటు భయ్యా బ్యాట్ బాల్ ఆడాలి. నేనేం నిన్ను బద్నాం చేయలేదు. రక్షా బంధన్ శుభాకాంక్షలు ఆర్‌పీ చోటు భయ్యా. అమ్మాయి మౌనంగా ఉందని అడ్వాంటేజ్ తీసుకోకు..’ అని పోస్ట్ పెట్టింది. ఇంటర్వ్యూ మాదిరిగానే ఇక్కడ కూడా రిషభ్ పేరు ఎత్తకుండానే  ఆర్‌పీ అని సంబోధిస్తూ  పంత్ కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది.  అనంతరం పంత్.. ‘నీ ఆధీనంలో లేని అంశాల గురించి నువ్వు ఒత్తిడికి గురికావాల్సిన అవసరం లేదు..’అని ఓ కొటేషన్ షేర్ చేశాడు. 

Follow Us:
Download App:
  • android
  • ios