Asianet News TeluguAsianet News Telugu

కరీబియన్ దీవుల్లో ధవన్, అయ్యర్ సాహసాలు... అభిమానులు ఫిదా (వీడియో)

వెస్టిండిస్ పర్యటనలో భారత ఆటగాళ్లు కేవలం క్రికెట్ నే కాదు ఆ దేశ అందాలను కూడా ఆస్వాదిస్తున్నారు. మ్యాచుల మధ్యలో  లభిస్తున్న ఖాళీ సమయాల్లో ఆటగాళ్లు సరదాగా కరీబియన్ దీవుల్లోని ప్రకృతి అందాలను ఆస్వాదిస్తున్నారు.  

team indian players enjoying In water games at windies
Author
West Indies, First Published Aug 13, 2019, 7:24 PM IST

టీ20, వన్డే, టెస్ట్ ఇలా మూడు పార్మాట్లలో టీమిండియా-వెస్టిండిస్ లు తలపడుతున్నాయి. ఇప్పటికే భారత జట్టు టీ20 సీరిస్ ను కైవసం చేసుకుని వన్డే సీరిస్ ను కూడా విజయంతో ప్రారంభించింది. ఇలా విండీస్ జట్టుపై అద్భుతమైన ప్రదర్శన చేస్తూ క్రికెట్ ను ఆస్వాదిస్తున్న భారత ఆటగాళ్లు పనిలోపనిగా కరీబియన్ దీవుల అందాలను కూడా ఆస్వాదిస్తున్నారు. స్థానిక ఆటగాడు కిరన్ పొలార్డ్ మన ఆటగాళ్లకు మంచి ఆతిథ్యాన్ని అందిస్తూ తమ దేశ అందాలను దగ్గరుండి చూపిస్తున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోను ధవన్ సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా మీడియాతో పంచుకున్నాడు. 

టీమిండియా సీనియర్ ప్లేయర్ శిఖర్ ధవన్ తో పాటు యువ ఆటగాళ్లు మయాంక్ అగర్వాల్, నవదీప్ సైనీ, శ్రేయాస్ అయ్యర్, వృద్దిమాన్ సాహాలు కరీబియన్ దీవుల్లో చక్కర్లు కొడుతున్నారు. తమ దేశంలోని పర్యాటక ప్రాంతాలు, అందమైన ప్రదేశాలను పొలార్డ్ వీరికి చూపిస్తున్నాడు. ఈ సందర్భంగా వీరంతా  కలిసి ఓ అందమైన నీటి కొలనులో బోటింగ్ తో పాటు జలకాలాటకు దిగారు. ఇలా ఆటగాళ్ళు కేవలం సరదాగా ఈతకొట్టడమే కాకుండా ప్రమాదకర రీతిలో సాహసాలు చేస్తూ కనిపించారు.

శిఖర్ ధవన్, శ్రేయాస్ అయ్యర్ లు నీటికుంట ఒడ్డున వున్న ఓ చెట్టుకు కట్టిన తాడును పట్టుకుని వేలాడుతూ నీటిలో దూకారు.  ఇలా కాస్త  ఎత్తునుండి వేగంగా చాలా తక్కువ లోతున్న నీటిలో దూకారు. ఇది చాలా ప్రమాదకరం అయినా వారికి ఎలాంటి అపాయం కలగలేదు. అంతుకాకుండా నీటిపై ప్రయాణిస్తున్న బోటుపై నుండి అమాంతం నీటిలోకి దూకారు. అదికూడా కాస్త ప్రమాదకరమైన రీతిలో. ఇలా ఆటగాళ్లు జలకాలాడుతూ సాహసాలు చేస్తున్న వీడియో అభిమానులకు తెగ నచ్చినట్లుంది. దీంతో వారు ఆ వీడియోను తెగ షేర్  చేస్తూ వైరల్ చేస్తున్నారు.      

ప్రపంచ కప్ తర్వాత జరుగుతున్న వెస్టిండిస్ పర్యటనలో టీమిండియా ఇప్పటికే పేచేయి సాధించింది. టీ20 సీరిస్ ను క్లీన్ స్వీప్ చేసి ఆతిథ్య జట్టును ఓడించిన భారత్ వన్డే సీరిస్ లోనూ సీరిస్ విజయానికి అడుగుదూరంలో నిలిచింది. ఇలా వారి దేశంలోనే పైచేయి సాధించి టీమిండియా మంచి ఊపుమీదుంది. 

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

Open water, the greenery and fresh air = bliss. 😄

A post shared by Shikhar Dhawan (@shikhardofficial) on Aug 12, 2019 at 10:03pm PDT

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

You can’t tell me I ain’t fly!

A post shared by Shreyas Iyer (@shreyas41) on Aug 12, 2019 at 5:12pm PDT

Follow Us:
Download App:
  • android
  • ios