టీమిండియా యువ కెరటం పృథ్వి షా కు బిసిసిఐ షాకిచ్చింది. కొంతకాలం క్రితమే అంతర్జాతీయ క్రికెట్ లో అడుగుపెట్టిన అతడికి కెరీర్ ఆరంభంలోనే పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. నిషేధిత మెడిసిన్స్ వాడటం ద్వారా పృథ్వి డోపింగ్ నిబంధనలను  అతిక్రమించినట్లు తమ విచారణలో తేలినట్లు బిసిసిఐ తెలిపింది. అందువల్లే అతడికి ఎనిమిది నెలల పాటు అంతర్జాతీయ క్రికెట్ నుండి సస్పెండ్ చేస్తున్నట్లు బిసిసిఐ  ప్రకటించింది.   

''ముంబై క్రికెట్ అసోసియేషన్ నుండి క్రికెటర్ గా గుర్తింపుపొందిన పృథ్వి షా నిషేధిత మెడిసిన్స్ తీసుకుంటున్నట్లు సమాచారం అందింది. మార్కెట్లో సాధారణంగా లభించే దగ్గు మందులను అతడు వాడాడు. అయితే ఆ మెడిసిన్స్ నిషేదిత ఔషదాల జాబితాలో వున్నాయి. దీంతో అంతర్జాతీయ డోపింగ్ నిబంధనలను అనుసరించి ఎనిమిది  నెలల పాటు నిషేధాన్ని విధిస్తున్నాం. ఈ నిషేధం మార్చ్ 16 నుండి నవంబర్ 15 వరకు అమల్లో వుంటుంది.'' అని బిసిసిఐ ప్రకటించింది. 

ఈ ఏడాది పిబ్రవరిలో ఇండోర్ వేదికన జరిగిన సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ లో పృథ్వి పాల్గొన్నాడు. ఈ సందర్భంగా బిసిసిఐ యాంటి డోపింగ్ అధికారులు అతడి నుండి యూరిన్ సాంపిల్స్ స్వీకరించారు. ఇందులోనే అతడు నిషేధిత మత్తు పదార్థాలను  స్వీకరించినట్లు తేలింది.     అందువల్లే ఈ నిషేధాన్ని విధించినట్లు బిసిసిఐ అధికారులు తెలిపారు. 

అయితే విచారణ సందర్భంగా పృథ్వి షా ఇచ్చిన వివరణతో సంతృప్తిచెందిన అధికారులు తక్కువ  కాలమే నిషేధాన్ని విధించింది. అనారోగ్యం కారణంగానే అతడు ఈ మెడిసిన్స్ వాడినట్లు తమ విచారణలో కూడా తేలింది.  షా రక్త నమూనాల్లో టర్బుటలైన్‌ అనే నిషేధిత ఉత్ప్రేరకం మెడిసిన్స్ ద్వారానే చేరినట్లు గుర్తించామని షా  బిసిసిఐ వెల్లడించింది. 

ఇక పృథ్వి షా తో పాటు విధర్బ క్రికెటర్ అక్షయ్ దలర్వాల్, రాజస్థాన్ ఆటగాడు దివ్య గజరాజ్ కూడా డోపింగ్ పరీక్షలో పట్టుబడ్డారు. దీంతో వారిపై కూడా బిసిసిఐ చర్యలు తీసుకుంది.