గత 11టెస్టుల్లో విరాట్ కోహ్లీ టాస్ గెలవడం ఇది రెండోసారి...కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్‌లకు అవకాశం...బుమ్రాకి విశ్రాంతి...తుది జట్టులోకి మహ్మద్ సిరాజ్... 

చెపాక్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో టాస్ గెలిచిన భారత జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. గత 11టెస్టుల్లో విరాట్ కోహ్లీ టాస్ గెలవడం ఇది రెండోసారి. తొలి టెస్టులో టీమిండియాపై 227 పరుగుల భారీ తేడాతో ఇంగ్లాండ్ విజయం సాధించిన విషయం తెలిసిందే.

తొలి టెస్టు పిచ్‌పై విమర్శలు రావడంతో రెండో టెస్టు కోసం టీమిండియా మేనేజ్‌మెంట్ దగ్గరుండి పిచ్‌‌ను తయారుచేయించింది. మొదటి రోజు నుంచే స్పిన్ బౌలర్లకు సహకరించేలా పిచ్‌ను రూపొందించారు.
టీమిండియా తరుపున స్పిన్నర్ అక్షర్ పటేల్‌ టెస్టుల్లో ఆరంగ్రేటం చేస్తున్నాడు.

బుమ్రాకి విశ్రాంతినిచ్చిన టీమిండియా, అతని స్థానంలో సిరాజ్‌ను జట్టులోకి తీసుకొచ్చింది. బ్యాటుతో రాణించిన వాషింగ్టన్ సుందర్ స్థానంలో అక్షర్ పటేల్ జట్టులోకి వచ్చాడు. కుల్దీప్ యాదవ్‌కి ఎట్టకేలకు అవకాశం దక్కింది.

భారత జట్టు: 
రోహిత్ శర్మ, శుబ్‌మన్ గిల్, ఛతేశ్వర్ పూజారా, విరాట్ కోహ్లీ,అజింకా రహానే, రిషబ్ పంత్, అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్, ఇషాంత్ శర్మ, సిరాజ్