దక్షిణాఫ్రికాతో స్వదేశంలో జరగనున్న మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు తాను అందుబాటులో ఉంటానని భారత మహిళా జట్టు సీనియర్ క్రికెటర్ మిథాలీ రాజ్ స్పష్టం చేసింది. అయితే ఆమె ఎంపిక అనుమానంగా ఉంది.

36 ఏళ్ల మిథాలీ 2021లో జరగనున్న వన్డే ప్రపంచకప్‌లో ఆడతానని చెప్పినా.. టీ20 వరల్డ్‌కప్‌ను దృష్టిలో ఉంచుకుని సెలక్టర్లు యువ క్రీడాకారిణులకు అవకాశం ఇవ్వాలని ఆలోచనతో ఉన్నారు.

దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌కు తాను అందుబాటులో ఉన్నానని.. అయితే వచ్చే ఏడాది జరిగే టీ20 వరల్డ్ కప్‌ గురించి ఇంకా ఆలోచించలేదని మిథాలీ స్పష్టం చేశారు. ప్రస్తుతానికి ఒక్కో సిరీస్‌పైనే దృష్టి పెట్టానని తెలిపారు.

మిథాలీ గొప్ప క్రికెటర్ అని అయితే ఆమె టీ20 కెరీర్‌పై త్వరగా ఓ నిర్ణయం తీసుకోవాలని కొందరు సూచిస్తున్నారు. మిథాలీ టీ20 జట్టులోకి ఎంపిక అవుతుందో లేదో తెలియాలంటే సెప్టెంబర్ 5 వరకు వెయిట్ చేయాల్సిందే.