73 వ ఇండిపెండెన్స్ డే సందర్భంగా భారత ప్రజలకు టీమిండియా క్రికెటర్లు శుభాకాంక్షలు  తెలిపారు. ఆటగాళ్లు విషెస్ చెబుతున్న వీడియయోను బిసిసిఐ ట్విట్టర్లో పోస్ట్ చేసింది.   

గురువారం యావత్ భారతం 73వ స్వాతంత్య్ర దినోత్సవం వేడుకలను ఘనంగా జరుపుకుంటోంది. దేశవ్యాప్తంగా మన మువ్వన్నెల జెండా రెపరెపలాడుతోంది. ఈ సందర్భంగా వెస్టిండిస్ పర్యటనలో వున్న టీమిండియా ఆటగాళ్లు దేశ ప్రజలకు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఇలా భారత ఆటగాళ్లు శుభాకాంక్షలు తెలుపుతున్న వీడియోను బిసిసిఐ తన అధికారిక ట్విట్టర్లో పోస్ట్ చేసింది. 

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు మిగతా జట్టు సభ్యులంతా శుభాకాంక్షలు తెలిపారు. చీఫ్ కోచ్ రవిశాస్త్రి కూడా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపాడు. యువ క్రికెటర్ కేదార్ జాదవ్ తన మాతృ బాష మరాఠీలో, కుల్దీప్ యాదవ్ హిందీలో...మిగతా ఆటగాళ్లందరూ ఇంగ్లీష్ లో తమ శుభాకాంక్షలు తెలిపారు. 

'' భారతీయులు ప్రతి ఒక్కరికి టీమిండియా తరపున స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు. జై హింద్'' అంటూ బిసిసిఐ ట్వీట్ చేసింది. ఈ ట్వీట్ కు ఆటగాళ్లు శుభాకాంక్షలు తెలుపుతున్న వీడియోను జతచేసింది. 

వీడియో

Scroll to load tweet…